Jurala Project: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద.. 31 గేట్లు ఎత్తివేత‌

Flood Water Flows To Jurala Project And 31 Gates Lift
x

Jurala Project: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద.. 31 గేట్లు ఎత్తివేత‌

Highlights

Jurala Project: కర్ణాటక నుంచి భారీగా వస్తున్న వరద నీరు

Jurala Project: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. ఎగువ కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి లక్ష 31 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు వచ్చి చేరుతున్నాయి. జూరాల ప్రాజెక్టు నుంచి 31 గేట్లు ఎత్తి లక్ష 31 వేల క్యూసెక్యుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు పెడుతుంది. జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.426 టీఎంసీల నీటి నిల్వగా ఉంది. ఎగువ నుంచి మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో జూరాల ప్రాజెక్టులోని కొన్ని మరికొన్ని గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉంది. కృష్ణానది ప్రవాహ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories