Fire in Train: ప్రమాద కారణాలపై రైల్వే అధికారుల దర్యాప్తు
Fire in Train: మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే స్టేషన్‌లోని నిలిచి ఉన్న ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం సంబవించింది. అందరూ చూస్తుండగానే.. ఎగిసి పడుతున్న అగ్ని కీలలకు కొన్ని భోగీలు కాలిపోయాయి. స్టేషన్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఇతర భోగీలకు వ్యాపించకుండా ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అరగంటలో ఆర్పివేశారు.
అయితే అప్పటికే బోగీల్లోని పర్నీచర్ మొత్తం కాలిపోయింది. అయితే మంటలు మొదట లగేజీ కమ్ గార్డ్ వ్యాన్ కోచ్‌లో సంభవించినట్టు తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. మంటల సమయంలో భోగీల్లో ఎవరైనా ఉన్నారా? అన్నది అంశంపైనా సమాచారం లేదు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్టు నాందేడ్ రైల్వే స్టేషన్ అధికారులు వెల్లడించారు.
#WATCH | Fire broke out in an empty luggage-cum-guar van coach stationed in the Nanded maintenance Yard today. The fire was completely brought under control within 30 minutes of the incident and there was no damage to any other coaches: CPRO South Central Railways #Maharashtra pic.twitter.com/m7xRK3eqpZ
— ANI (@ANI) December 26, 2023
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire