Telangana Budget 2021: బడ్జెట్‌ ముఖ్యాంశాలు..

Finance Minister Harish Rao Presented The Budget in the Assembly
x

Telangana Budget 2021: బడ్జెట్‌ ముఖ్యాంశాలు..

Highlights

Telangana Budget 2021: 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు.

Telangana Budget 2021: 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు...

• ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లు.

• మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు.

• పెట్టుబడి వ్యయం రూ.29,046.77 కోట్లు.

• రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లు.

• పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.29,271 కోట్లు.

• సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ -రూ. వెయ్యి కోట్లు.

•వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు

• రైతుబంధు- రూ.14,800 కోట్లు.

• రుణమాఫీ- రూ.5,225 కోట్లు.

•వ్యవసాయశాఖ - రూ.25వేల కోట్లు

• పశుసంవర్థకశాఖ- రూ.1,730 కోట్లు.

• నీటిపారుదలశాఖ- రూ.16,931 కోట్లు.

• సమగ్ర భూ సర్వే- రూ.400 కోట్లు.

• ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు.

• కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ రూ.2,750 కోట్లు.

• ఎస్సీల ప్రత్యేక ప్రగతి కోసం రూ.12,304 కోట్లు.

• ఎస్టీల ప్రత్యేక ప్రగతి కి రూ.12,304 కోట్లు.

• నేతన్నల సంక్షేమం కోసం రూ.338 కోట్లు.

• బీసీ సంక్షేమశాఖకు రూ.5,522 కోట్లు.

• పాఠశాల విద్యకు రూ.11,735 కోట్లు.

• ఉన్నత విద్యకు రూ.1,873 కోట్లు.

• మూసీ నది అభివృద్ధికి రూ.200 కోట్లు.

• మెట్రో రైలుకు రూ.1000 కోట్లు.

• ఓఆర్‌ఆర్‌ వెలుపల నీటి సరఫరాకు రూ.250 కోట్లు.

• ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.150 కోట్లు.

• ఆర్టీసీకి రూ.15 00 కోట్లు.

• అటవీ శాఖకు రూ.1,276 కోట్లు.

• పౌరసరఫరాల శాఖకు రూ.2,363 కోట్లు.

• నూతన సచివాలయ నిర్మాణానికి రూ.610 కోట్లు.

• రీజినల్‌ రింగ్‌రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు.

• ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృధ్ధి నిధుల కోసం రూ.800 కోట్లు.

• డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం రూ.11వేల కోట్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories