Telangana Budget 2024-25: తెలంగాణ మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లు.. ఏ శాఖకు ఎన్ని నిధులంటే..

Finance Minister Bhatti Vikramarka Introduces Vote On Account Budget In Telangana Assembly
x

Telangana Budget 2024-25: తెలంగాణ మెత్తం బడ్జెట్ రూ.2,75,891కోట్లు.. ఏ శాఖకు ఎన్ని నిధులంటే..

Highlights

Telangana Budget 2024-25: గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు

Telangana Budget 2024-25: తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి తమ ప్రభుత్వం మొదట్లోనే శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టిందని భట్టి గుర్తుచేశారు.

ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఇవేవీ తమకు అడ్డుకాదని, ఎంత కష్టపడడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క మండిపడ్డారు.

ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం రూ.53,196 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు.

పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు

పురపాలక శాఖకు రూ.11692 కోట్లు

మూసీ రివర్ ఫ్రాంట్‌కు వెయ్యి కోట్లు

వ్యవసాయ శాఖకు రూ.19746 కోట్లు

ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు

ఎస్సీ సంక్షేమానికి రూ.21874 కోట్లు

ఎస్టీ సంక్షేమానికి రూ.13013 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.2262 కోట్లు

బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.

బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు

విద్యా రంగానికి రూ.21389 కోట్లు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు.

యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు

వైద్య రంగానికి రూ.11500 కోట్లు

విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2418కోట్లు.

విద్యుత్ సంస్థలకు రూ.16825 కోట్లు.

గృహ నిర్మాణానికి రూ.7740 కోట్లు.

నీటి పారుదల శాఖకు రూ.28024 కోట్లు కేటాయించారు

Show Full Article
Print Article
Next Story
More Stories