ఏపీ సర్కార్‌ వర్సెస్‌ ఎస్ఈసీ..నిమ్మగడ్డ రిలీజ్‌ చేసిన యాప్‌ డేటా స్టోరేజి ఎక్కడ?

ఏపీ సర్కార్‌ వర్సెస్‌ ఎస్ఈసీ..నిమ్మగడ్డ రిలీజ్‌ చేసిన యాప్‌ డేటా స్టోరేజి ఎక్కడ?
x
Highlights

*సర్కార్‌ వర్సెస్‌ ఎస్ఈసీ మధ్య ఆధిపత్య పోరు *రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన ఎస్‌ఈసీ జిల్లాల పర్యటన *నిమ్మగడ్డ పర్యటనలలో రాజకీయ కోణం ఉందా?

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విశేషాలన్నీ దర్శనమిస్తున్నాయి. పేరుకు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా... తెర వెనుక అంతకు మించిన అసలు సిసలైన పోరు జరుగుతున్నట్లుంది. తెరవెనుక సాగుతున్న మైండ్‌గేమ్‌ ఎవరికి అంతుబట్టడం లేదు. ఇక పంచాయతీ ఎన్నికల కేంద్రంగా సాగుతున్న జగన్‌ సర్కార్‌ వర్సెస్‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆధిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ జిల్లాల పర్యటన మరింత వేడి రాజేస్తోంది. నిమ్మగడ్డ పర్యటనలలో రాజకీయ కోణం ఉందా?

పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చిన మరుక్షణం నుంచీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. షెడ్యూల్‌ను మార్చి మరీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసారు. మొదటి విడత నామినేషన్లు జరుగుతుండగానే ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలపై నిర్ణయం తీసుకున్నారు. వెంటనే జిల్లాల పర్యటన ప్రారంభించారు. మొదటి నుంచీ చంద్రబాబు కోసం పనిచేసే వ్యక్తిగా పేరున్న నిమ్మగడ్డ పర్యటన చర్చనీయాశమైంది.

ఈసీ ఐదు జిల్లాల పర్యటన పూర్తి చేసారు. ఎక్కడికక్కడ రాజ్యాంగ విధి నిర్వహణలో ఉన్నానని, స్ధానిక ఎన్నికలు క్షేత్రస్ధాయిలో బలాన్ని చేకూరుస్తాయని అంటున్నారు. అయితే ఆయన చేకూర్చే బలం ఎవరికోసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరికోసం ఈ క్షేత్రస్ధాయి బలప్రదర్శన అనే చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఎస్ఈసీ చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ఈ-వాచ్ యాప్ ను రిలీజ్ చేసారు. కానీ ఏ యాప్ కైనా.. సర్వర్.. డేటా స్టోరేజి వంటి ఏర్పాటు ఉంటుంది. మరి ఆ ఏర్పాటు ఎక్కడ అనేదానికి నో ఆన్సర్. నా మాట నా ఇష్టం అన్నట్టుగా మీడియాతో మాట్లాడి.. జిల్లాల పర్యటనకు బయలుదేరారు. నాలుగు జిల్లాల పర్యటన తరువాత కూడా క్షేత్రస్ధాయిలో ఉంటారట అని అంటున్నారు. ఎవరికోసమో అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఎస్‌ఈసీ పర్యటన హాట్‌ టాపిక్‌ అయ్యింది.




Show Full Article
Print Article
Next Story
More Stories