కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు

Farmers Suffering from Kaleswaram Back Water | TS News
x

కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోతున్న రైతులు

Highlights

*ఏటా వేల ఎకరాల్లో వాటిలుతున్న నష్టం

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గాల్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో ఏటా వేల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారు రైతులు. గత మూడేళ్లుగా గోదావరి తీర రైతులకు వరద పోటు మాత్రం తప్పడం లేదు. పంట నష్ట పరిహారం అందక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరమైనా వరదలకు ముందే ముంపు ప్రాంతాలను గుర్తించాలని అధికారులను రైతులు కోరుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తరువాత గోదావరి తీర ప్రాంతంలోని రైతుల పంట, ఎటా వానాకాలంలో నీట మునుగుతూనే ఉంది. గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం పూర్తయినప్పటి నుండి ఈ పంటల నష్టం ఎక్కువయ్యింది. దీనిపై రైతులు సైతం ఆందోళన నిర్వహించారు. నదులకు ఆనుకుని ఉన్న మండలాల్లో రైతులకు నష్టపరిహారం అందించాలని ఏటా కోరుతూనే ఉన్నారు. గోదావరినది ముంపుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, రైతు స్వరాజ్య వేదిక హైకోర్టులో కేసు వేయగా అది విచారణలో ఉంది.

అధిక వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రాజెక్టుల పూర్తి నీటి సామర్ధ్యం వద్ద గేట్లు ఎత్తివేస్తుంటారు. జిల్లాలోని ఎల్లంపల్లి సుందిళ్ల అన్నారం మేడిగడ్డ గేట్ల వరకు ప్రభావం ఉంటోంది. గత సీజన్లలో ఎల్లంపల్లి పరీవాహకంలోని హాజీపూర్ మండలం నుంచి పాత మంచిర్యాలతో పాటు జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ నగర్, రాంనగర్ కాలనీలకు వరద నీరు చేరింది. గత వానాకాలంలో ఐదు వేల ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి.

మేడిగడ్డ బ్యారేజీతో కోటపల్లి మండలం దేవులవాడ రాపన్ పల్లి అర్జున గుట్ట అన్నారం బ్యారేజీతో చెన్నూరు మండల పరిధి, సుందిళ్ల బ్యారేజీతో జైపూర్ మండలం హాజీపూర్ మండలాల పరిధిలో గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీటి భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా అన్నారం పరిధిలో సర్వే పూర్తయ్యింది. మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి నివేదిక రావాల్సి ఉంది. సర్వే చేసిన చోట సాగునీటి శాఖ నుంచి డబ్బులు జమకాకపోవడంతో రైతులకు పరిహారం అందటం లేదు. ఈ ఏడాది సైతం పంటలు వేస్తే నష్టపోతామేమో అనే భయంతో రైతులు ఉన్నారు.

ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు.. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని వర్షాలకు ముందే పంటలు మునగకుండా చర్యలు చేపట్టాలని పంటలు నీట మునిగిన వారికి సరైన నష్ట పరిహారం త్వరితగతిన ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories