KTR: కేటీఆర్‌ను కలిసిన కొడంగల్ నియోజకవర్గ రైతులు

Farmers from Kodangal seek KTR support in fight against land acquisition for pharma companies
x

KTR: కేటీఆర్‌ను కలిసిన కొడంగల్ నియోజకవర్గ రైతులు

Highlights

KTR: ఫార్మా కంపెనీల కోసం తమ భూములు ఇవ్వాలని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

KTR: కొడంగల్ నియోజకవర్గ రైతులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని... ఈ విషయంలో తమకు అండగా నిలబడాలని దౌల్తాబాద్‌ మండల రైతులు కోరినట్టు సమాచారం. దుద్యాల్ మండలంలోని హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని...ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం రైతులు చెబుతున్నప్పటికీ, ఇతర నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని రైతులు చెప్పారని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories