ధాన్యం రైతుల దైన్యం.. క్వింటాకు 6 కిలోల మేర తరుగు తీస్తున్న మిల్లర్లు

Farmers Facing Problems with Rice Mills to Sell Paddy in Nizamabad | Telugu Online News
x

ధాన్యం రైతుల దైన్యం.. క్వింటాకు 6కిలోల మేర తరుగు తీస్తున్న మిల్లర్లు

Highlights

Nizamabad - Farmers Problems: తరుగు పేరుతో రైతన్న నిలువుదోపిడి.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతుల కష్టాలు

Nizamabad - Farmers Problems: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు, రైస్ మిల్లర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారుతోంది. ధాన్యం కొనుగోళ్లలో.. వాళ్లు చెప్పిందే వేదంగా మారింది. మొన్నటి సీజన్‌లో ఇష్టానుసారంగా తరుగు కట్ చేసిన మిల్లర్లు.. ఈ ఏడాది అదే తరహాలో తరుగు తీస్తున్నారు.

అధికారులు మిల్లులకు ధాన్యం కేటాయింపులు పూర్తి చేసినా.. హామాలీలు లేరనే సాకుతో ధాన్యం తరలింపునకు కొందరు రైస్ మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా.. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఇప్పటికే 80 శాతం కోతలు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 458 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ పాటికే సగానికి పైగా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 9లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

లక్ష్యానికి అనుగుణంగా 271 మిల్లులకు అనుమతులిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, తేమ శాతం పేరుతో తరుగు తీస్తూ.. రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు.

క్వింటా ధాన్యానికి రెండున్నర కిలోల తరుగు కోనుగోలు కేంద్రాలు తీస్తుండగా.. రైస్ మిల్లుల నిర్వహాకులు మరో 3 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. సొసైటీల్లో అడ్డగోలుగా తూకంలో మోసం, తరుగు దోపిడి కొనసాగుతోందని రైతులు మండిపడుతున్నారు. నిబంధనలతో తెచ్చిన ధాన్యానికి కూడా తరుగు తీస్తున్నారని.. ఇప్పటికైనా మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories