సన్నరకం పంటకు నిప్పు.. మంటల్లో దూకే ప్రయత్నం చేసిన రైతు

సన్నరకం పంటకు నిప్పు.. మంటల్లో దూకే ప్రయత్నం చేసిన రైతు
x
Highlights

సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లిలో మంటల్లో దూకి ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఎం కేసీఆర్ పిలుపుతో సన్నరకం పంట వేసి తీవ్రంగా నష్టపోయానని...

సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లిలో మంటల్లో దూకి ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఎం కేసీఆర్ పిలుపుతో సన్నరకం పంట వేసి తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మూడెకరాల పంటకు నిప్పుపెట్టి ఆ మంటల్లో దూకే ప్రయత్నం చేశాడు రైతు బాపిరెడ్డి. అతడిని గ్రామస్తులు అడ్డుకుని వెనక్కి తీసుకువచ్చారు.

రైతు బాపిరెడ్డి తనకున్న ఐదెకరాల పొలంలో మూడు ఎకరాల్లో సన్న రకం, రెండెకరాల్లో దొడ్డు రకం సాగు చేశాడు. అయితే దొడ్డురకం పంట బాగానే పండగా సన్నరకం మాత్రం పూర్తిగా దెబ్బతింది. దీంతో పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ప్రభుత్వ ఒత్తిడితో సన్నరకం సాగు చేసి పూర్తిగా నష్టపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మూడెకరాల పంటకు నిప్పుపెట్టి దాంట్లో దూకే ప్రయత్నం చేశాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories