Nizamabad: బ్యాంక్ పేరుతో మెసేజ్.. క్లిక్ చేసిన రైతుకు షాక్..

Farmer Loses 4 Lakhs To Fraudsters
x

Representational Image

Highlights

Online Fraud: నిజామాబాద్‌ జిల్లాలో ఓ రైతుకు సైబర్ మోసగాళ్లు టోకరా పెట్టారు.

Online Fraud: నిజామాబాద్‌ జిల్లాలో ఓ రైతుకు సైబర్ మోసగాళ్లు టోకరా పెట్టారు. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును కొట్టేశారు కేటుగాళ్లు. ఈ నెల 10న గుర్తుతెలియని నెంబర్ నుంచి ముత్యంరెడ్డికి వాట్సాప్ లో బ్యాంకు లోగోతో కూడిన లింక్ వచ్చింది. దీంతో ఆ లింక్‌ను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతా నుంచి పలు దఫాలుగా 4 లక్షల రూపాయలు మాయమయ్యాయి.

అప్రమత్తమైన రైతు వెంటనే బ్యాంకు సిబ్బందిని సంప్రదించి అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించాడు. అనంతరం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు. కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు కాస్త సైబర్ నేరగాళ్ల పాలవ్వడంతో ఆవేదన చెందుతున్నాడు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొందరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటోన్న కేటుగాళ్లు ఈజీగా డబ్బులు కొట్టేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories