Khammam: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంటూ హాల్ చల్.. కట్ చేస్తే.. వూహించని షాక్..!

Fake Food Inspectors Caught Redhanded in Khammam
x

Khammam: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంటూ హాల్ చల్.. కట్ చేస్తే.. వూహించని షాక్..!

Highlights

నగరంలోని మమతా రోడ్‌లోని ఓ హోటల్‌కు వెళ్లిన నలుగురు వ్యక్తులు.. కిచెన్‌లోకి వెళ్లి ఆహార పదార్థాలు పరిశీలించారు.

Khammam: ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడుతున్న కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొత్తగూడెం జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి హోటళ్లలో తనిఖీ చేసినట్టు నటించారు. దీంతో వారి గుట్టురట్టైంది.

నగరంలోని మమతా రోడ్‌లోని ఓ హోటల్‌కు వెళ్లిన నలుగురు వ్యక్తులు.. కిచెన్‌లోకి వెళ్లి ఆహార పదార్థాలు పరిశీలించారు. సాకులు చెప్పి రెండు లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామంటూ డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన యజమాని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించాడు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories