నకిలీ ఇంజిన్ ఆయిల్ ముఠా గుట్టురట్టు

Fake Engine Oil Gang In Suryapet
x

నకిలీ ఇంజిన్ ఆయిల్ ముఠా గుట్టురట్టు

Highlights

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంగా నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా

Suryapet: సూర్యాపేట కేంద్రంగా నకిలీ ఇంజన్ ఆయిల్ దందా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కొందరు ముఠాగా ఏర్పడి పేరున్న బ్రాండ్ల లేబుల్స్‌తో కల్తీ ఆయిల్ వ్యాపారం చేస్తూ లక్షలు దండుకుంటున్నారు. కంపెనీలు కూడా చూసీచుడనట్టు వదిలేయడంతో ఫేక్ ఆయిల్ మాఫియా మరింతగా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఆటోమోబైల్స్ షాపులు, మెకానిక్‌లు నకిలీ ముఠాతో చేతులు కలపడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఎట్టకేలకు సూర్యాపేట పోలీసులు నకిలీ ఇంజన్ ఆయిల్ ముఠా గుట్టురట్టు చేశారు.

సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో తెలుగురాష్ట్రాల్లో కొందరు కేటుగాళ్లు ముఠాగా ఏర్పడి నకిలీ ఇంజన్ వ్యాపారం చేస్తున్నారు. ఫేక్ ఆయిల్ డబ్బాలను ఢిల్లీలో తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, కోదాడ ప్రాంతాల్లోని ఆయిల్ ఏజెన్సీలకు, ఆటోమోబైల్స్ షాపుల్లో ఎక్కువ ధరకు అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకొంటున్నారు. పక్కా సమాచారంతో సూర్యాపేట పోలీసులు కేటుగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తే నకిలీ ఆయిల్ దందా బాగోతం బట్టబయలైంది. నిందితుల నుంచి 3.80 లక్షల రూపాయల విలువగల నకిలీ ఇంజిన్ ఆయిల్ డబ్బాలను సీజ్ చేశారు.

నిందితులను రిమాండ్‌కు తరలించారు. విజయవాడ కృష్ణలంకు చెందిన నాగ దుర్గాప్రసాద్ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నకిలీ ఆయిల్‌ దందాకు తెరలేపాడని పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన దుర్గాప్రసాద్‌కు సూర్యాపేట రూరల్ మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన రేపాల నాగార్జున రెడ్డి పరిచయమయ్యాడు. అతని ద్వారా సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో గుట్టుగా నకిలీ దందా కొనసాగించాడు.

ఇదిలా ఉంటే పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన కీలక సమాచారంతో పోలీసులు కంపెనీ గోడౌన్‌లపై మరిన్ని దాడులు నిర్వహించి మరోకరిని అదుపులోకి తీసుకున్నారు. కొద్దికాలం పాటు ఓ ప్రముఖ ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల్లోని మొకానిక్‌లకు మోహన్ రెడ్డి విక్రయించాడు. కంపెనీ ఆయిల్స్ విక్రయించడం వల్ల తక్కువ రాబడి రావడంతో ఎలాగైనా కంపెనా ఆయిల్స్ నకిలీ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని ఆశంతో ఏకంగా నకిలీ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. హైదరాబాద్‌లో వాహనాల నుంచి తీసే ఇంజన్ ఆయిల్ 9 రూపాయలకు కొనుగోలు చేసి ధర్డ్ క్వాలిటీ ఇంజన్ ఆయిల్ 14 రూపాయిలకు తీసుకొచ్చి గోడౌన్‌లో ఈ రెండింటిని రీ సైక్లింగ్ చేసేవాడు.

ఆయిల్ రీ సైక్లింగ్ అనంతరం వివిధ కంపెనీలకు చెందిన లేబుల్స్ తీసుకొచ్చ లీటర్, 25 లీటర్లు, 50 లీటర్ల డబ్బాలపై అంటించేవాడు. డబ్బాలలో నకిలీ ఇంజన్ ఆయిల్ నింపి మెకానిక్‌లకు, వాహనదారులకు నేరుగా లీటర్ 140 రూపాయిల చొప్పున సరఫరా చేసేవాడు. దీంతో నకిలీ భాగోతంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు గోడౌన్‌పై దాడులు చేసి 13.8 లక్షల విలువ చేసే నకిలీ ఇంజన్ ఆయిల్, వివిధ కంపెనీలు చెందిన లోగోలు, హాండ్ పంప్స్, డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories