Fake Drugs: చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు తయారీ.. పక్కా సమాచారంతో పోలీసుల ఎంట్రీ!

Fake Drug Manufacturing group Arrested In Hyderabad
x

Fake Drugs: చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు తయారీ.. పక్కా సమాచారంతో పోలీసుల ఎంట్రీ!

Highlights

Fake Drugs: మెగ్‌లైఫ్‌ సైన్సె్స్ కంపెనీ పేరుతో మందుల విక్రయం

Fake Drugs: తెలంగాణలో నకిలీ మందుల తయారీ కేంద్రాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో చాక్‌పౌడర్, గంజితో మెడిసిన్ తయారు చేసి విక్రయిస్తోన్న ముఠాను గుర్తించారు. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మార్కెట్‌లోకి మెడిసిన్స్ రిలీజ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. 33 లక్షల విలువైన మెడిసిన్‌ను సీజ్ చేసింది డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. దీంతో మెగ్ లైఫ్‌సైన్సెస్ పేరుతో సరఫరా అవుతోన్న మందుల వాడకాన్ని నిలిపివేయాలని కోరింది. ఈ ట్యాబ్లెట్లు ఆరోగ్యానికి హానికరమంటూ హెచ్చరించింది. రిటెయిలర్స్ కూడా ఈ మెడిసిన్‌ను డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక నకిలీ మందులు తయారు చేస్తోన్న ముఠాలపై కేసులు నమోదు చేసింది డీసీఏ.

Show Full Article
Print Article
Next Story
More Stories