ఫేక్ డాక్టర్స్, నిషేధిత మందులు.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో వెలుగులోకి నిజాలు

ఫేక్ డాక్టర్స్, నిషేధిత మందులు.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో వెలుగులోకి నిజాలు
x
Highlights

Fake doctors and selling Schedule H drugs: తెల్లనివన్ని పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావన్న చందంగా స్టెతస్కోప్ పట్టుకున్న ప్రతీ ఒక్కరు డాక్టర్స్...

Fake doctors and selling Schedule H drugs: తెల్లనివన్ని పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావన్న చందంగా స్టెతస్కోప్ పట్టుకున్న ప్రతీ ఒక్కరు డాక్టర్స్ అయిపోరు. వారిలో ఫేక్ డాక్టర్స్ కూడా ఉంటారని గుర్తించాలి. అలా ఎలా అవుతుందని అంటారా? అయితే, మీరు ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తాజాగా హన్మకొండ, ఖాజీపేట పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఫేక్ డాక్టర్స్ పట్టుబడ్డారు. ఇటీవల మంగమ్మ అనే 60 ఏళ్ల మహిళ కొద్దిపాటి అనారోగ్య సమస్యతో బాధపడుతూ దీన్ దయాల్ నగర్ లో డాక్టర్ గా క్లినిక్ రన్ చేస్తోన్న బండి సదానందం అనే వ్యక్తి వద్దకు చికిత్సకు వెళ్లారు. సదానందం చికిత్స తరువాత ఆమె పరిస్థితి విషమించి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు.

ఇదే విషయమై మంగమ్మ కుటుంబసభ్యులు పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆ క్లీనిక్ పై దాడులు నిర్వహించారు. సదానందం డాక్టర్ లైసెన్స్ లేకుండానే క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఈ తనిఖీల్లో తేలింది. మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక తనిఖీల్లో మెట్టపల్లి సాంబమూర్తి, కే ప్రభాకర్ అనే మరో ఇద్దరు ఫేక్ డాక్టర్స్ కూడా పట్టుబడ్డారు. కేవలం ల్యాబ్ టెక్మీషియన్స్‌గా మాత్రమే అర్హతలు ఉన్న వీళ్లు ఏకంగా తమని తాము డాక్టర్స్ గా చెప్పుకుని క్లినిక్స్ కూడా నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

ఇదే సోదాల్లో వీణా మెడికల్స్ అనే మెడికల్ షాపు నిర్వాహకులు సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిషేధత షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ఎంబీబీఎస్ డాక్టర్స్ లేదా ఫార్మసిస్టుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాప్స్ వాళ్లు నిషేధిత ఔషదాల అమ్మకాలు కొనసాగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ ప్రెసిడెంట్ డా అన్వర్ మియా అభిప్రాయపడ్డారు.

ఈ తరహా వ్యాపారం చేసే మెడికల్ షాప్స్ నిర్వాహకుల గురించి డ్రగ్ కంట్రోల్ అథారిటీకి ఫిర్యాదు చేస్తామని అధికారులు చెప్పారు. ఆయా మెడికల్ షాప్స్ లైసెన్సులు రద్దు చేయాల్సిందిగా డ్రగ్ కంట్రోల్ అథారిటీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. గల్లీగల్లీకొక క్లినిక్ వెలుస్తున్న ఈ రోజుల్లో అక్కడ పనిచేసే డాక్టర్స్ అసలు డాక్టర్సా లేక నకిలీ వైద్యులా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని తరచుగా వెలుగుచూస్తోన్న ఇలాంటి ఘటనలు చెబుతున్నాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు ఒక్కచోటుకే పరిమితం కాకూడదని, తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి సోదాలు జరిగితేనే నకిలీ డాక్టర్స్ గుట్టు రట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories