MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత జ్యూడిషియల్ రిమాండ్ పొడిగింపు

Extension Of Kavitha Judicial Remand In Delhi Liquor Case
x

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత జ్యూడిషియల్ రిమాండ్ పొడిగింపు

Highlights

MLC Kavitha: ఈనెల 20 వరకు కవిత జ్యూడిషియల్ రిమాండ్ పొడిగింపు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్‌ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఆరు రోజులపాటు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో రౌస్‌ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది.

కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్‌ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories