శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు

శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పేలుడు
x
Explosion at Shivarampally Railway Station
Highlights

హైదరాబాద్ శివారులోని శివరాంపల్లిలో కలకలం రేగింది. హైదరాబాద్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని కాటేదాన్‌ వడ్డెర బస్తీలోని చెత్తకుప్పలో ఈ పేలుగు సంభవించింది.

హైదరాబాద్ శివారులోని శివరాంపల్లిలో కలకలం రేగింది. హైదరాబాద్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని కాటేదాన్‌ వడ్డెర బస్తీలోని చెత్తకుప్పలో ఈ పేలుగు సంభవించింది.పేలుడు శబ్దం విన్న స్ధానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇండ్ల కిటికీల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. పేలుడు సంభవించిన సమయంలో దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలుపుతున్నారు.

ఈ పేలుగు ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఏదైనా రసాయన పదార్థం కారణంగా పేలుడు సంభవించిందా లేదా జెలెటిన్ స్టిక్స్ వల్ల పేలుడు సంభవించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories