తిరగబడిన పోలీస్ వ్యూహం.. డైరీ లీక్ చేసి..

తిరగబడిన పోలీస్ వ్యూహం.. డైరీ లీక్ చేసి..
x
Highlights

Maoist Bhaskar: పోలీసుల వ్యూహం తిరుగబడింది. డైరీ లీక్ చేసి అదివాసీలకు దడపుట్టించాలనుకున్నారు. ఆ ఎత్తుగడ పోలీసులకు బెడిసి కోట్టింది అసలు...

Maoist Bhaskar: పోలీసుల వ్యూహం తిరుగబడింది. డైరీ లీక్ చేసి అదివాసీలకు దడపుట్టించాలనుకున్నారు. ఆ ఎత్తుగడ పోలీసులకు బెడిసి కోట్టింది అసలు మావోయిస్టు బాస్కర్ డైరీ లోని పేర్లను బయట పెట్టడానికి కారణాలేంటి అదివాసీలకు నిజంగా మావోయిస్టులతో సంబందాలు ఉన్నాయా? మావోయిస్టులతో సంబందాలు ఉంటే సర్కార్ ఆధారాలను బయట పెట్టకుండా ఎందుకు జంకుతోంది ? మావోల డైరీ లీక్ పై అదివాసీలు సర్కార్ మధ్య అసలేం జరుగుతోంది.?

ఉమ్మడి ఆదిలాబాద్ మావోలకు కంచుకోటలా మారుతోందని పోలీసుల అంచనా దీంతో మావోయిస్టుల ఉనిపై పోలీసులు వ్యహత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత జూలై నెలలో కుమ్రంబీమ్ జిల్లా తిర్యాని మండలం గుండాల అడవుల్లో మావోలు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న మావోయిస్టు కీలక సభ్యుడు బాస్కర్, ‌మరోక నలుగురు అక్కడినుంచి పరారయ్యారు. మావోలు పారిపోయిన స్థావరంలో బారీగా డంప్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న డంప్ లో రెండు తుపాకులు, విప్లవ సాహిత్యం, మావోయిస్టు నాయకుడు బాస్కర్ డైరీ పోలీసులకు చిక్కింది.

ఇప్పుడు‌ ఆ డైరీలోని ఆంశాలే సంచలనంగా‌ మారాయి. డైరీ ఆధారాంగా మావోలకు అదివాసీలు సహకరిస్తున్నారనేది పోలీసులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కోందరు అదివాసీ నాయకులు మావోలు బలపడటానికి రిక్రూట్ మెంట్ ను ప్రోత్సహిస్తున్నారని మావోలతో సంబందాలు కోనసాగిస్తున్న వారి పేర్లను ఎస్పీ ప్రెస్ నోట్ తో వారి పేర్లను బయట పెట్టారు. పోలీసులు విడుదల చేసిన పేర్లలో మత్తాడిగూడ గ్రామానికి చెందిన సీడమ్ జంగదేవ్, సులుగు పల్లికి చెందిన సోయం చిన్నయ్య, రొంపల్లికి చెందిన చంద్ర శేఖర్, చాల్ బడి గోవిందరావు, పార్వతిగూడ హనుమంతరావు, చోర్ పల్లి జగ్గారావు, తుడుందెబ్బకు చెందిన మహేశ్, డి.టి.ఎఫ్.కు చెందిన రమేశ్, ఆదివాసి విద్యార్థి సంఘానికి చెందిన వివేక్ మరియు దీపక్ లు ఇంకా కొంతమంది మావోయిస్టు నాయకులు భాస్కరుతో సంబంధాలు పెట్టుకొని, అతడు ఇచ్చిన ఆదేశాల మేరకు మావోయిస్టు కార్యక్రమాలు రహస్యంగా అమలు చేస్తున్నారని పోలీసులు పోలీసులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆదివాసి యువకుల వాదన మాత్రం మరోలా ఉంది. మావోయిస్టు నాయకుడు బాస్కర్ డైరీ పేరుతో పలువురి పేర్లను బయటపెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మావోలతో సంబందాలు ఉన్నాయని అదారాలు ఉంటే బయట పెట్టాలని పోలీసులు ప్రకటించిన డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటు పోలీసుల ఆరోపణలు చేయడం ఇటు ఆదివాసీలు ఆధారాలు డిమాండ్ చేయడంతో పాటు పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేస్తామనడంతో కుమ్రంబీమ్ జిల్లా అటవీప్రాంతం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక ఈ మొత్తం వ్యవహారంపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయఘటనలూ జరకుండాఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆదివాసీలకు మావోలతో సంబందాలు ఉన్నాయని సర్కార్ వేదిస్తుందన్న చర్చకు సైతం తెరలేవడంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు సైతం అందాయని తెలుస్తోంది. మరి ప్రభుత్వం ప్రయత్నాలు ఏలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories