Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్.. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 నుంచి పరీక్షలు

Exams for Group 1 Mains will be conducted from 21st of this month according to line clear schedule
x

Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్.. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 నుంచి పరీక్షలు

Highlights

Group 1 Mains : గ్రూప్ 1 మెయిన్స్ కు లైన్ క్లియర్ అయ్యింది. సింగిలో బెంచ్ తీర్పును హైకోర్టు సమర్థించింది. షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

Group 1 Mains : మొత్తానికి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలకు దాఖలైన్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీనితో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.

ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు ఫైనల్ కీలో సరైన జవాబులు ఇవ్వలేదని ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్ల జాబితా ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేయారు. వాటిని హైకోర్టు కొట్టివేసింది.

2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసేందుకు మరో నోటిఫికేషన్ జారీ చెల్లదని..ప్రాథమిక కీలో తప్పులున్నాయని..వాటిని సవరించాలన్న అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.

గతంలో గ్రూప్ 1 నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వందల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది ప్రిలిమ్స్ రాశారని..టీజీపీఎస్సీ వెలువరించిన ఫైనల్ కీలో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రశ్నలను తొలగించి తాజా కీని రూపొందించి అభ్యర్ధుల జాబితాను రెడీ చేయాలని కోరారు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన 3 లక్షల మంది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరారు. 721 మంది భౌతికంగా, 6470 అభ్యంతరాలను ఆన్ లైన్లో స్వీకరించినట్లు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపించిన వారి ఆమోదం తర్వాత ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories