అతి త్వరలో కొత్త పాత్రలో కవిత?

అతి త్వరలో కొత్త పాత్రలో కవిత?
x
Highlights

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన మాజీ ఎంపీ కవిత, మళ్లీ యాక్టివ్ అవుతున్నారా తెలంగాణ జాగృతి పేరుతో చేస్తున్న హడావిడి ఇందుకోసమేనా పార్టీ...

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన మాజీ ఎంపీ కవిత, మళ్లీ యాక్టివ్ అవుతున్నారా తెలంగాణ జాగృతి పేరుతో చేస్తున్న హడావిడి ఇందుకోసమేనా పార్టీ కీలక నేతలు, మంత్రులు జాగృతి కార్యక్రమాలను ప్రమోట్ చెయ్యడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఇదంతా చూస్తుంటే, త్వరలోనే కవిత పార్టీలో కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్న కవిత, పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరం అయ్యారు. కొన్ని నెలలుగా ఎవ్వరికీ అందుబాటులోకి రాని కవిత, వ్యక్తిగత పనులకే పరిమితమయ్యారు. తాజాగా బతుకమ్మ ఉత్సవాలతో మళ్లీ తెరపైకి వచ్చారు. రెండేళ్లు పార్టీ పనులకే పరిమితమైనా, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనలేదు కవిత. విదేశాల్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాగృతి సంస్థలోని కమిటీలను రద్దు చేసి కార్యక్రమాలను ఆపివేసిన కవిత తాజాగా మళ్లీ జాగృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

రెండేళ్లుగా జాగృతి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమానికీ హాజరుకాని కవిత ఈసారి జాగృతికి అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ జాగృతి కార్యకర్తలు బతుకమ్మ సంబరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే లు, జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను, కవిత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మాట్లాడటం చూస్తుంటే త్వరలోనే, టీఆర్ఎస్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ నియమించారు. మొన్నటి వరకు పార్టీ బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్‌కు మళ్లీ క్యాబినెట్ లో చోటు కల్పించడంతో, ఇక కవితకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ సూచనల మేరకే, కవిత జాగృతిని యాక్టివ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓవైపు గులాబీ పార్టీలో కవితకు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నేతలే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్సీ ఇవ్వాలని, లేకుంటే రాజ్యసభ స్థానం ఇచ్చి ఢిల్లీలో మళ్లీ యాక్టివ్ చేయాలని కూడా కోరుతున్నారు.

మంత్రిగా కేటీఆర్, పాలనపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. మున్సిపల్ మంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా కలియ తిరుగుతున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఎదుర్కొవాల్సి ఉంది. ఇటు ప్రభుత్వం అటు పార్టీని చూడటం కేటీఆర్‌కు కత్తి మీద సాము లాంటిది. దీంతో మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీ బాధ్యతలు కొన్ని చూసేందుకు కవితను రంగంలోకి దింపడం ఖాయంలా కనిపిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories