Praja Bhavan: ప్రజాభవన్‌ ముందు కారు బీభత్సం కేసులో కీలక విషయాలు

Ex Mla Shakeel Son Car Accident At Praja Bhavan In Hyderabad
x

Praja Bhavan: ప్రజాభవన్‌ ముందు కారు బీభత్సం కేసులో కీలక విషయాలు

Highlights

Praja Bhavan: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ స్థానంలో.. మరొకరిని కేసులో ఇరికించే ప్రయత్నం

Praja Bhavan: ప్రజాభవన్‌ ముందు కారు బీభత్సం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్‌ ప్రమాదానికి కారణమని.. రాజకీయ పలుకుబడితో అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సోహెల్‌ స్థానంలో మరొకరిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. అతని ఇంట్లో పనిచేసే వ్యక్తి డ్రైవింగ్ చేసినట్టు చిత్రీకరించే యత్నం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అర్ధరాత్రి 2.45 గంటలకు ప్రజాభవన్ ముందు ప్రమాదం జరగ్గా.. BMW కారుతో ప్రజాభవన్‌ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టారు. నెంబర్ ప్లేట్‌తో వివరాలు సేకరించిన పోలీసులు.. ఘటనా సమయంలో సోహెల్‌ డ్రైవింగ్ చేసినట్టు గుర్తించారు. ప్రమాదం జరగ్గానే సోహెల్‌ పరారవగా.. మరో యువకుడు అబ్దుల్ ఆసిఫ్‌పై కేసు నమోదు చేశారు. అయితే షకీల్ తనకు ఉన్న పలుకుబడితో కొడుకును తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories