KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్‌లో మాజీమంత్రి కేటీఆర్ ఆగ్రహం

Ex-minister KTR is angry with the Congress government in X
x

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్‌లో మాజీమంత్రి కేటీఆర్ ఆగ్రహం

Highlights

KTR: ప్రజల హక్కుల గురించి రాహుల్ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు

KTR: మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. శ్రీధర్‌బాబు ఓ మీటింగ్‌లో అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి గొడవపై మాట్లాడుతూ.. వారిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని అన్నారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటుంటే... అందులో కాంగ్రెస్‌ పార్టీని జోక్యం చేస్తున్నారు... ఇది న్యాయమా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నారని.. అలాంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారని అన్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం అరెకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు.

దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘‘అతి తెలివి మంత్రి గారు.. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా? అని ప్రశ్నించారు. సరే మీ మాటే నిజం అనుకుందాం... మరి మా BRS ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు? సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు? అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు అని నిలదీశారు. మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వారిని మా వాళ్లు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోందన్నారు. మీరు మీ అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories