Etela Rajendra Review on Corona: 81శాతం మందిలో ఎలాంటి ల‌క్షణాల్లేవు: ఈట‌ల‌

Etela Rajendra Review on Corona: 81శాతం మందిలో ఎలాంటి ల‌క్షణాల్లేవు: ఈట‌ల‌
x
etela rajender
Highlights

Etela Rajendra Review on Corona: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.

Etela Rajendra Review on Corona: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 81 శాతం మందికి ఎలాంటి కరోనా లక్షణాలు కనబ‌డ‌టం లేద‌ని ఈటల రాజేందర్ చెప్పారు. 19 శాతం మందికి మాత్రమే డాక్టర్ల సేవలు అవసరం ఉంటాయని ఆయన తెలిపారు. వైద్యుల్లో స్ఫూర్తినింపేందుకే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో వైద్యుల సేవలు అభినందనీయమన్నారు. వైద్యులు కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్నారన్నారు. చరిత్రలో వైద్యుల సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చెప్పారు. కరోనా బారినుండి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ముఖ్యమంత్రి ఎంత ఖర్చయినా పర్వాలేదని సీఎం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ర్యాపిడ్ కిట్ల ద్వారా కరోనాను నిర్ధారిస్తున్నామన్నారు. ఆశావర్కర్ల నుండి మొదలు ఉన్నతస్థాయి అధికారుల వరకు నిబద్ధతో పనిచేస్తే కరోనాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని సూచించారు.

కంటెన్మెంట్ అనే పదానికి తెలంగాణ రాష్ట్రమే స‌రైన నిర్వ‌చ‌నం ఇచ్చిందని అన్నారు. తెలంగాణ మాత్రమే సంపూర్ణంగా లాక్ డౌన్ ను అమలు చేసింద‌న్నారు. తమిళనాడు,కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల కంటే తెలంగాణలో మాత్రమే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. మరణాల రేటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ ఉంద‌ని అన్నారు.అలాగే, గ‌తంలో కంటే ఆస్ప‌త్రుల్లో మెరుగైన స‌దుపాయాలున్నాయ‌ని, ఆస్ప‌త్రుల్లో వెంటిలేటర్ అధిక మొత్తంలో సమకూర్చుకున్నామని ఆయన తెలిపారు. వైద్యుల మనోభావాలు దెబ్బతీసే వార్తలను ప్రచురించడం బాధ‌క‌ర‌మ‌ని, క‌ష్టకాలంలో సేవలందిస్తున్న వైద్యులను అభినందించడం పోయి విమర్శించ‌డం స‌రికాద‌ని ఆయ‌న అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories