Etela Rajender Visit Warangal MGM: గాంధీ తరహాలో ఎంజీఎం.. తెలంగాణా మంత్రి ఈటెల వెల్లడి

Etela Rajender Visit Warangal MGM: గాంధీ తరహాలో ఎంజీఎం.. తెలంగాణా మంత్రి ఈటెల వెల్లడి
x
etela rajender
Highlights

Etela Rajender Visit Warangal MGM: కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించే విధంగా తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Eatela Rajender Visit Warangal MGM: కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించే విధంగా తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరీక్షలు దగ్గర్నుంచి వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే గాంధీ అస్పత్రిలో ఇలాంటి విధానం అమలవుతుండగా తాజాగా వరంగల్ లోని ఎంజీఎంలో సైతం ఇదే తరహాలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి ఈటెల రవీంద్రనాధ్ తెలిపారు.

కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ లోని గాంధీ దవాఖాన తరహాలో వరంగల్ ఎంజీఎంను తీర్చిదిద్దుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఎంజీఎంను సందర్శించిన అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఎక్కడికక్కడే ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

వరంగల్ ఎంజీఎంలో ప్రస్తుతం కరోనా సోకిన వారి కోసం ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 340 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్యను 750కు పెంచుతామని ఈటల ప్రకటించారు. అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వరంగల్ నగరానికి ప్రత్యేకంగా మోబైల్ ల్యాబ్స్ పంపించనున్నట్లు ఈటల ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి, వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ పై ఎక్కువ దృష్టి పెట్టామని పేర్కొన్నారు.

ఎంజీఎంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. కేఎంసీలో మరో వార్డు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.. ఎంత మంది రోగులొచ్చినా హైదరాబాద్ కానీ, ప్రైవేటు దవాఖానలకు కానీ పోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. కరోనా సోకిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. మిగతా వారిలో కూడా ఎక్కువ శాతం మంది కోలుకుంటున్నారని వివరించారు. మరణాల సంఖ్య ఒకశాతం లోపే ఉంది.

ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకిన వారు ధైర్యంగా ఉండడమే అసలు మందు అన్నారు. వైరస్ సోకిన ప్రతీ ఒక్కరికీ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నాం. బంధువులు ముందుకు రాకపోతే ప్రభుత్వ పరంగానే ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా విషయంలో శ్రద్ధ పెడుతూనే సీజనల్, అంటు వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలన్నారు. వానలు, వరదలు వచ్చినందున జ్వరాలు, ఇతర రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కావున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories