Etela Rajender: తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ పవర్ సెంటర్‌గా మారబోతున్నారా?
Etela Rajender: తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ పవర్ సెంటర్‌గా మారబోతున్నారా? సంచలన విజయం సాధించిన ఈటల పార్టీకి అదనపు బలమని అధిష్టానం నమ్ముతోందా? ఈటల ఢిల్లీ టూర్ తరువాత పార్టీలో ఆయన రోల్ ఏంటో క్లారిటీగా తెలియబోతోందా? ఇప్పటికే పార్టీలోకి వచ్చిన వారు పాత వాళ్లు గ్రూపులతో పాటు ఎడిషనల్‌గా ఈటల గ్రూపంటూ ఒకటి కొత్తగా ఏర్పాటు కాబోతోందన్న వాదనల్లో బలమెంత?
హుజూరాబాద్‌లో సంచలనం విజయం సాధించిన ఈటల రాజేందర్ కమలం క్యాంప్‌లో మరో పవర్ సెంటర్‌గా ఎదిగే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే మాంచి జోష్‌లో ఉన్న కమలం క్యాడర్ బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత నుంచి మరింత జోష్ మీదుంది. సంజయ్ సారథ్యంలో పార్టీకి అన్నీ విజయాలు వస్తుండడంతో వ్యక్తిగతంగా బండి ఇమేజ్‌తో పాటు పార్టీ ఇమేజ్‌కి మంచి మైలేజ్ వచ్చిందన్న ప్రచారం నడుస్తోంది. బండి సంజయ్ సారథిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చిన మొదటి ఉపఎన్నిక దుబ్బాకలో ఊహకందని విధంగా కమలం జెండా ఎగిరింది. గులాబీ కంచుకోటలను బద్దలు కొడుతూ అధికార పార్టీ అవాక్కయ్యేలా షాకిచ్చింది. ఆ తరువాత వచ్చిన గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో కూడా 47 సీట్లు సాధించి తెలంగాణలో బీజేపీకి తిరుగులేదని చాటి చెప్పే విధంగా సంకేతాలిచ్చింది కాషాయపార్టీ. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నిక కూడా కమలం నేతలకు ఎప్పుడూలేనంత ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలో చరిత్రలో మరిచిపోలేని విజయం నమోదు చేసింది.
ఇంతవరకు బాగానే ఉన్నా బీజేపీలో ఈటల గెలుపుపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈటల గెలుపుతో మరో పవర్ సెంటర్ తయారయ్యే ప్రమాదం పార్టీలో లేకపోలేదన్న చర్చకు ఊతమిస్తుంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభం ఉన్న ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్‌కు ముచ్చమటలు పట్టిస్తూ సవాలు చేసి హుజూరాబాద్‌లో గెలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఈటల ఇమేజ్ రాష్ట్రవ్యాప్తంగా పెరిగిందనే ప్రచారం నడుస్తోంది. కాకపోతే, ఇంతటి రాజకీయ అనుభవం ఉన్న ఈటలను కమలనాథులు ఎలా వాడుకుంటారన్న దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈటలకు తెలంగాణ ఉద్యకారురుడిగా మంచి పేరుండడంతో ఆయన, నాటి ఉద్యమకారులను కమలం క్యాంప్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ బాధ్యతలను ఈటల భుజం మీద పెట్టేందుకు కమలం పెద్దలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే తెలంగాణ కమలం నేతలను హస్తినకు పిలిపించుకున్న హైకమాండ్ వాళ్ల ముందే పార్టీలో ఈటల రోల్ ఏంటో చేయబోయే పనులేంటో క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఒక్క ఈటలనే ఢిల్లీకి పిలిపించుకొని పార్టీలో నీ పాత్ర ఇది అని చెప్పడం కంటే అదేదో అందరి ముందే చెబితే బెటరని ఆలోచించిన అధిష్టానం నేతలందరినీ కట్టకట్టుకొని రమ్మని కబురు పంపిందన్న ప్రచారం జరుగుతోంది. ఈటల కూడా తాను గెలిచి ఇన్నాళ్లయినా రాష్ట్ర పార్టీలో తన బాధ్యతలు ఏంటి భవిష్యత్‌లో పార్టీని ఎలా పరుగులు పెట్టించాలన్న దానిపై నేతలతో చర్చించే అవకాశం ఉందట. హస్తిన పర్యటన తర్వాత బీజేపీలో ఈటల బాధ్యతలు ఏంటో క్లారిటీగా తెలిసే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో సాగుతోంది.
అయితే తెలంగాణలో బీసీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్‌కు మంచి పేరుండడంతో ఈ రెండు సెక్టార్లను కమలం పార్టీ వైపు ర్యాలీ చేయడానికి రాష్ట్రమంతా పర్యటించనున్నారట. ఇందుకు పార్టీ కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కో-ఆర్డినేషన్‌తోనే వర్కవుట్ చేసేలా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణలకు ఎవరికి వారి పవర్ సెంటర్లు ఉన్నట్టే రేపు రేపు ఈటలకు మరో పవర్ సెంటర్ ఫామ్ అయ్యే చాన్స్ ఉందని పార్టీ పెద్దలు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో ఈటల వర్గీయులు, ఉద్యమంలో కలసి పనిచేసిన అనుభవమున్న కొందరు నాయకులు కూడా బీజేపీలో చేరి ఈటలకు వర్గంగా తయారయ్యే అవకాశం ఉందన్న ఆందోళన పార్టీలో కనిపిస్తోందట. మరి ఇలాంటి ఇబ్బందులకు సారథి ఎలా చెక్ పెడుతారో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire