రవీందర్‌ బ్యాక్‌బోన్‌ రాజేందర్‌.. టీఆర్ఎస్‌ మూలాలను దెబ్బతీసేందుకు ఈటల ఎత్తుగడా?

Etela Rajender Gives Big Shock to CM KCR Over TRS MLC Tickets
x

రవీందర్‌ బ్యాక్‌బోన్‌ రాజేందర్‌.. టీఆర్ఎస్‌ మూలాలను దెబ్బతీసేందుకు ఈటల ఎత్తుగడా?

Highlights

Ravinder Singh: ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన కరీంనగర్‌లో కారు పార్టీకి చుక్కెదురవుతోందా?

Ravinder Singh: ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన కరీంనగర్‌లో కారు పార్టీకి చుక్కెదురవుతోందా? హుజురాబాద్ ఫలితంతో తేరుకోని గులాబీ పార్టీకి స్థానిక సంస్థల మండలి ఎన్నికలు మరో తలనొప్పిగా మారాయా? మాజీ మేయర్, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ లీడర్ రవీందర్‌సింగ్‌తో నామినేషన్ వేయించి అజ్ఞాతంలోకి పంపిది ఎవరు? ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టి చేయి కాల్చుకున్న టీఆర్ఎస్‌ను లోకల్ బాడీ ఎన్నికల్లో అదే కోవర్టు రాజకీయంతో మరో షాక్ ఇవ్వాలని స్కెచ్ వేసింది ఎవరు? బలం, బలగం లేకపోయినా గులాబీ క్యాంపులో నుంచే కోవర్టులను తయారు చేసి హుజురాబాద్ మాదిరి ఫలితం రాబట్టాలని కసిగా రగిలిపోతున్నది ఎవరు?

తెలంగాణలో మండలిలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల క్యాంపు రాజకీయాలు రసవత్తగా సాగుతున్నాయి. ఒక్కో జిల్లా ప్రజాప్రతినిధులు ఒక్కో చోట క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే, ఇతర జిల్లాల క్యాంపు రాజకీయాలు ఒక రకంగా ఉంటే కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధుల రాజకీయాలు మరోలా ఉన్నాయట. అధికార టీఆర్ఎస్‌ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ లీడర్, కరీంనగర్‌ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌ నామినేషన్ ఇప్పుడు పార్టీ హైకమాండ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. రవీందర్‌సింగ్‌ను బుజ్జగించేందుకు గులాబీ పెద్దలు రంగంలోకి దిగినా టచ్‌లోకి రాకపోవడంతో పాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట.

రవీందర్‌సింగ్‌కు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే ఆయన స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేసి ఉంటారని పార్టీ భావించింది. కానీ, తీరా ఆరా తీస్తే రవీందర్‌సింగ్ నామినేషన్ వెనుక హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఉన్నారన్న సమాచారం కారు పార్టీలో కంగారు పుట్టిస్తోందట. ఆ మాటకొస్తే రవీందర్‌సింగ్‌ను అజ్ఞాతంలోకి పంపింది కూడా ఈటలే అని తెలుసుకొని టీఆర్ఎస్‌కు దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిందట. దీంతో మంత్రలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు కీలక ఎమ్మెల్యేలకు పార్టీ హై కమాండ్ నేరుగా టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుందట.

తాను హుజురాబాద్‌కే పరిమితం కాకుండా టీఆర్ఎస్‌ మూలాలను దెబ్బ తీసేందుకు ఈటల రాజేందర్‌ పకడ్బందీ ప్లాన్‌ వేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్. మండలి క్యాంపు పెట్టాలంటే కోట్లల్లో ఖర్చవుతుంది. ఆ ఖర్చు కూడా రవీందర్‌సింగ్‌ పక్షాన రాజేందరే భరిస్తున్నారట. ప్రస్తుతం ఈటల రాజేందర్ స్థానిక సంస్థల ఓటర్ల బాజితాను రెడీ చేసుకున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 1326 మంది ప్రజాప్రతినిధులున్నారు. అంటే 1326 ఓట్లు. ఇందులో 825 మంది టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు కాగా, 213 మంది కాంగ్రెస్, 105 మంది బీజేపీ, ఎంఐఎంకు 11 మంది, 145 మంది స్వతంత్రులున్నారు. వీరందరి జాబితాను సిద్దం చేసుకున్న ఈటల శామీర్‌పేట నుంచి చక్రం తిప్పుతన్నారట. కాంగ్రెస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు కలిపి దాదాపు 500 మంది ప్రజాప్రతినిధులున్నారని, ఇక నియోజకవర్గాల వారిగా హుజురాబాద్, మంథని, మానకొండూర్, హుస్నాబాద్ కరీంనగర్‌ల నుంచి అధికార పార్టీ సభ్యులకు గాలం వేయాలని చూస్తున్నారట.

ఉమ్మడి కరీంనగర్ నుంచి రెండు స్థానాలుంటే ఒక ఓటు రవీందర్‌సింగ్‌కు, మరో ఓటు టీఆర్ఎస్‌కి వేసుకోవాలని ఓపెన్‌గా చెబుతున్నారట. టీఆర్ఎస్‌ క్యాంప్‌లో ఉంటూనే రవీందర్‌సింగ్‌కు ఓటు పడేలా హుజురాబాద్ ఓటరు చైతన్యాన్ని చెబుతున్నారట. అంతేకాకుండా ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు కాంగ్రెస్ ఓటర్లకు ఈపాటికే చెప్పేశారట. బీజేపీ గనుక సీరియస్‌గా ఉంటే, క్యాంపులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే రవీందర్‌సింగ్ కడదాక పోటీలో ఉంటారా లేక బుజ్జగింపులకి లోనవుతారా? అధిష్టానాన్ని ఎదురిస్తారా? అనే కోణంలో ఈటల శిబిరం కొత్త పరీక్షలు పెడుతోందట.

అయితే, రవీందర్‌సింగ్ మొన్నటిదాక కరీంనగర్‌ మేయర్‌గా పనిచేశారు. మరోసారి అవకాశం కోసం చూసినా పార్టీ హైకమాండ్ చేయిచ్చింది. అలాగని ఆయన్ను పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. దీంతో తీవ్ర ఆవేదనలో ఉన్న రవీందర్‌సింగ్ సమయం వస్తే పార్టీ మారాలని చూస్తున్నారు. మండలికైనా అవకాశం ఇస్తారని భావించారు. అది కూడా ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారట. అయితే మండలికి నామినేషన్ వేయడం అంటే అషామాషీ వ్యవహారం కాదు అయినా రవీందర్‌సింగ్ ఎందుకు ఇంత ధైర్యం చేసి ఉంటారని పార్టీ వర్గాలు ఆరా తీస్తే ఈయన వెనుక టీఆర్ఎస్‌ ఓట్లు కూడా ఉన్నాయని తేలడంతో పార్టీ ఒక్కసారిగా ఖంగుతిన్నదట.

అయితే, రవీందర్‌సింగ్‌ను విత్ డ్రా చేయించే బాధ్యతను మంత్రులకు అప్పగించిందట అధిష్టానం. రెండు రోజుల నుంచి రవీందర్‌ ఫోన్ స్విఛ్చాఫ్ వస్తుండటంతో క్యాంప్‌లోనే గులాబీ పార్టీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది. కరీంనగర్్కు చెందిన 38 మంది కార్పోరేటర్లు, మంత్రి గంగుల సమక్షంలో భేటీ అయ్యి రవీందర్‌సింగ్ వ్యవహారం గురించి చర్చించిందట. ఏమైనా మండలి పాలిటిక్స్ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో అది టియ్యారెస్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories