New Revenue Act in Telanagana: తొందర్లోనే కొత్త రెవెన్యూ చట్టం ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం..

New Revenue Act in Telanagana: తొందర్లోనే కొత్త రెవెన్యూ చట్టం ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం..
x

KCR

Highlights

New Revenue Act in Telanagana: వచ్చే నెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తు న్నారు

Telangana | అన్ని శాఖల కంటే రెవెన్యూలోనే అధికంగా అవినీతి జరగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. దీనిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అధికారుల తీరులో మార్పు రావడం లేదు. దీనిని గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం ముందుగా చట్టంలో లోపాలను సవరించి, కొత్తగా రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.

వచ్చే నెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసు కురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తు న్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన ముసా యిదా చట్టానికి తుదిరూపునిచ్చి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసిం ది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొత్తచట్టం రూపకల్పనపై సీఎం శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్త చట్టంలో చేయాల్సిన మార్పు చేర్పులపై మరింత కసరత్తు చేయాలని అధికారు లను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టా దారు పాసు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని ఇవ్వాల్సి ఉందనేది ఆరా తీశారు.

వ్యవసాయ, వ్యవసాయే తర భూముల విస్తీర్ణం విష యంలో నెల కొన్న గందరగోళంపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. దేవాలయ భూముల తో సహా అన్ని కేటగిరీల భూముల వివరాలపై చర్చిస్తూ, గతంతో పోలిస్తే వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరగడాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఉద్యో గులు, డిప్యూటీ కలెక్టర్ల వివరాలు, పాత చట్టంలో సమూలంగా మార్చాల్సిన నిబంధనలు, కొత్త చట్టంలో చేర్చాల్సిన అంశాలు తదితరాలపై మరింత కసరత్తు జరగాలని సూచించినట్లు సమాచారం. వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు, డిప్యూటీ కలెక్టర్లను ఏ ప్రభుత్వ విభాగాల్లో సర్దుబాటు చేయాలనే అంశం పైనా చర్చ జరిగినట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టానికి సం బంధించిన అంశాలపై సీఎం సోమవారం మరో మారు సమీక్షిస్తారని రెవెన్యూ వర్గాలువెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories