Erragadda Rythu Bazar closed in Hyderabad: కరోనా దెబ్బకు మూతపడ్డ ఎర్రగడ్డ రైతు బజార్

Erragadda Rythu Bazar closed in Hyderabad: కరోనా దెబ్బకు మూతపడ్డ ఎర్రగడ్డ రైతు బజార్
x
Highlights

Erragadda Rythu Bazar closed in Hyderabad: హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు క్రమక్రమంగా రెట్టింపు అవుతున్న నేపథ్యంలో ఎర్రగడ్డ రైతు బజార్ మూతపడింది.

Erragadda Rythu Bazar closed in Hyderabad: హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా రెట్టింపు అవుతున్న నేపథ్యంలో ఎర్రగడ్డ రైతు బజార్ మూతపడింది. రైతు బజార్ లో కూరగాయలు సప్లై చేసే ఓ కాంట్రాక్టర్ కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. దీంతో అప్రమత్తమయిన అధికారులు మూడు రోజుల పాటు ఎర్రగడ్డ రైతు బజార్ రైతుబజార్‌ను మూసివేశారు. అంతే కాదు చనిపోయిన కాంట్రాక్టర్‌తో కాంటాక్ట్ అయిన వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అనంతరం రైతుబజార్ ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. రైతు బజార్ ప్రాంగణంలో ఎవరికైనా కరోనా లక్షణాలను కనిపిస్తే తమకు సమాచారం అందించాలి తెలిపారు. ఇక రైతు బజార్ లో కాంట్రాక్టర్ మృతి చెందిన విషయం తెలియడంతో బజార్‌కు వెళ్లిన ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. ఇక పోతే కరోనా వైరస్ భయంతో ఇప్పటి వరకు నగరంలో ఎన్నో మార్కెట్లు మూతపడ్డాయి.

ఇక పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 1590 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,902కు చేరుకున్నాయి.ఇక ఈ రోజు 1,166 మంది డిశ్చార్జ్ కాగా, కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 7 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 295కు చేరింది. ఆదివారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 1277 కేసులు వచ్చాయి. ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 82, మేడ్చల్ జిల్లాలో 125, కరీంనగర్ జిల్లాలో 04, సంగారెడ్డిలో 04, మహబూబ్ నగర్ లో 19, నల్గొండ జిల్లాలో 14, సూర్యాపేటలో 23, వనపర్తిలో ౦4, నిజామాబాద్ , మెదక్ లో 03, నిర్మల్ , వికారాబాద్ ,భద్రాది కొత్తేగుడం, జనగాంలలో రెండేసి కేసులు, ఇక సిద్దిపేట, గద్వాల్, సిరిసిల్లా , వరంగల్ రూరల్ , పెద్దపల్లి, యదాద్రి, కామారెడ్డి, ఆదిలాబాద్ లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.

ఇక కొత్తగా 1,166 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 12,703 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,904 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఆదివారం కొత్తగా 5,290 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,15,835 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే శుక్ర , శని, ఆది వారాల్లో కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories