Errabelli Dayakar Rao: 24 గంటలు విద్యుత్, రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత మన కేసిఆర్‌ది

Errabelli Dayakar Rao Campaign At Thorrur
x

Errabelli Dayakar Rao: 24 గంటలు విద్యుత్, రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత మన కేసిఆర్‌ది

Highlights

Errabelli Dayakar Rao: గత ఎలక్షన్లో కంటే ఈసారి మెజారిటీ ఎక్కువగా ఇవ్వాలని కోరిన ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్నారు. తొర్రూరు మండలం గుడిబండ తండాలో ప్రచారం నిర్వహించిన ఆయన.. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. గత ఎలక్షన్లో కంటే ఈసారి మెజారిటీ ఎక్కువగా ఇవ్వాలని కోరారు. 24 గంటలు విద్యుత్ , రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత మన కేసిఆర్‌ది అని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రైతుబంధు, దళిత బంధు పలు పథకాలతో పాటు.. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయిన ఎర్రబెల్లి.. కష్టకాలంలో మీ వెంట ఉన్న దయన్నను కాపాడతారా లేదంటే ఓట్లు కొనాలని చూస్తున్న కాంగ్రెస్ వాళ్ళని కాపాడతారా మీరే ఆలోచించుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories