Encounter In Telangana: మావోల కోసం గాలింపు.. జల్లెడ పడుతున్న పోలీసు యంత్రాంగం
Encounter In Telangana: ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా అడవుల్లో బీకర శబ్ధాలు వినిపిస్తున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులకు తెగబడుతున్నారు
Encounter In Telangana: ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా అడవుల్లో బీకర శబ్ధాలు వినిపిస్తున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులకు తెగబడుతున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు, వారిని ఎదుర్కొనేందుకు పోలీసులు తాపత్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి ఇద్దరు మావోయిస్టుల పూర్తి వివరాలు తెలుసుకోగా, పోలీసులు కావాలనే పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.
ఆసిఫాబాద్‌లోని కదంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని పామి డి ప్రాంతానికి చెందిన చుక్కాలు, మరొకరు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అద్దాలతిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక బాది రావుగా గుర్తించారు. చుక్కాలు యాక్షన్ టీం సభ్యుడిగా ఉండగా, బాదిరావు 3 నెలల క్రితమే కేబీఎం (కుమురంభీం–మంచిర్యాల) దళంలో చేరాడు. మృతదేహాల వద్ద 9ఎంఎం కార్బన్ ఆటోమేటిక్, 12 బోర్ ఆయుధాలు, రెండు కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, కేం ద్ర కమిటీ లేఖలు, రామజన్మభూమి ప్రతు లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలకు ఆ దివారం సిర్పూర్(టి) ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాదిరావు కు టుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఘ టన స్థలానికి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ, రామగుం డం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఓ ఎస్డీ, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కు మార్‌రెడ్డి, ఏఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, కాగజ్‌నగర్ రూరల్ సీఐ సురేందర్ చేరుకున్నారు.
అడెళ్లు కోసం గాలింపు
ఎన్‌కౌంటర్ మృతుల్లో మైలవరపు అడెళ్లుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న వర్గీస్‌తో పాటు మరో మహిళ ఉన్నట్లు తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వారిద్దరు కాదని ఐడీ కార్డుల ద్వారా తేల్చారు. కదంబా అటవీ ప్రాంతంలోనే మరికొందరు దళ సభ్యులు ఉ న్నారనే సమాచారంతో 14 గ్రేహౌండ్స్ బృం దాలు, ఉమ్మడి జిల్లాకు చెందిన 6 స్పెషల్ పా ర్టీ బలగాలతో ప్రాణహిత తీరం నుంచి కౌటా ల, బెజ్జూరు, దహెగాం, నీల్వాయి, చెన్నూరు గోదావరి తీరం వరకు కూంబింగ్ ముమ్మరం గా సాగుతోంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేఎంబీ దళ నేత అయిన అడెళ్లు అలియాస్ భాస్కర్ కోసం గాలింపు విస్తృతం చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 15 మంది దళంలో చేరినట్లు సమాచారం రావడంతో వారి కోసం గాలిస్తున్నారు. అనుమానితుల ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
భాస్కర్ కోసం గాలింపు ముమ్మరం
తెలంగాణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా 'ఆపరేషన్ నిఘా'పేరుతో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ కోసం చేపట్టిన వేట ముమ్మరంగా సాగుతోంది. శనివారం రాత్రి కదంబా ఎన్‌కౌంటర్‌లో భాస్కర్ తృటిలో తప్పించుకోవడంతో అతని కోసం సమీపంలోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ కూంబింగ్‌లో పెద్ద ఎత్తున సివిల్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి. మూడునెలలుగా పోలీసులు తనను నీడలా వెంటాడుతున్నా.. ఆసిఫాబాద్‌ను వీడకుండా.. భాస్కర్ ఇక్కడే ఎందుకు ఉంటున్నాడన్న విషయం పోలీసులకు తొలుత అంతుచిక్కలేదు. తర్వాత ఈ విషయంలో పోలీసులు ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం.
రిక్రూట్‌మెంట్ కోసం ఇక్కడే..!
సాధారణంగా మావోయిస్టులు నిరంతరం స్థావరాలు మారుస్తారు. కానీ, ఆసిఫాబాద్ అడవుల్లో సివిల్, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ దళాలు తనను పట్టుకునేందుకు నీడలా అనుసరిస్తోన్నా.. భాస్కర్ అక్కడే ఎందుకు తచ్చాడుతున్నాడన్న దానిపై పోలీసులకు కొంత సమచారం లభించింది. తెలంగాణలో తిరిగి పూర్వవైభవం కోసం తపిస్తోన్న మావోయిస్టులు ఆసిఫాబాద్ నుంచి రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు భారీగా సన్నాహాలు చేశారు. ఇందులో కొంతమేరకు సఫలీకృతమయ్యారన్న అనుమానాలు ఉన్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కోటేశ్వరరావు ఆదేశాల మేరకు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ మాజీ సానుభూతిపరులు, ఇన్‌ఫార్మర్లను కలుస్తున్నాడన్నది పోలీసులకు లభించిన సమాచారం. తిర్యాణి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీసులకు లభించిన డైరీలో లభ్యమైన 15 మంది పేర్లు సానుభూతిపరులవా? లేక రిక్రూట్ అయ్యారా? అన్న విషయంలో పోలీసులకు ఇంకా స్పష్టత లేదు. ఆ జాబితాలో కొందరు అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. మిగిలిన వారి కోసం వెదుకులాట ఇప్పటికే ప్రారంభమైంది.
మూడోసారి...
జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే.. భాస్కర్ లాక్‌డౌన్ కాలంలో స్థానికంగా పలువురిని రిక్రూట్ చేసుకున్నాడని, పాత సానుభూతిపరులతో తిరిగి పరిచయాలు పెంచుకున్నాడన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. మహారాష్ట్ర సరిహద్దు నుంచి కాగజ్‌నగర్, ఈస్గాం వరకు భాస్కర్ దళం దాదాపు 40 కిలోమీటర్లు లోనికి వచ్చి స్వేచ్చగా సంచరించడం వెనక స్థానికుల సహకారం ఉండి ఉంటుందని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. జూలై 12వ తేదీన తొలుత తిర్యాణి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నాక పోలీసులు అతని కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ తరువాత ఇటీవల భాస్కర్ జైనూరు మండలం షార్పల్లిలో తలదాచుకున్నాడన్న సమాచారంతో గ్రేహౌండ్స్ పోలీసులు గ్రామంలోకి రాత్రిపూట వెళ్లారు. ఇది తెలుసుకున్న గూడెం ప్రజలు పోలీసులను అడ్డుకున్నారు. వాగ్వాదం చెలరేగడంతో గ్రేహౌండ్స్ బలగాలపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. అలా భాస్కర్ రెండోసారి తప్పించుకున్నాడు. కదంబా ఎన్‌కౌంటర్‌లో మూడోసారి తమ కళ్ల ముందునుంచి భాస్కర్ పారిపోయాడని పోలీసులు వివరించారు. మైదానాల్లోకి వెళితే.. డ్రోన్ కెమెరాలకు చిక్కే ప్రమాదముండటంతో దట్టమైన అడవుల్లోకి వెళ్లాడని పోలీసులు అంటున్నారు. పోలీసుల వేట ముమ్మరమైన ప్రతీసారి మహరాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో తలదాచుకుంటున్నాడన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది.
సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి కుట్ర భగ్నం..
ఇటీవల మావోయిస్టులు చర్ల మండలంలోని తిప్పాపురం సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి కుట్రపన్నారు. 200 మందికిపైగా మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొనేందుకు సమాయత్తమయ్యారు. ఈనెల 13వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో వాగు దాటుతున్న వందలాదిమంది మావోయిస్టులు ఈ దాడి కోసమే బయల్దేరారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. ఈ వీడియోలు మీడియాలో వైరల్ కావడంతో తెలిసిందే. వారిని ఎదుర్కొనేందుకు భారీగా బలగాలతో కూంబింగ్ చేపట్టారు. దీంతో తెలంగాణలోకి మావోయిస్టులు రాకుండా సీఆర్పీఎఫ్ క్యాంపు దాడిని పోలీసులు సమర్థంగా అడ్డుకోగలిగారు. భారీ విధ్వంసాలకు దిగాలన్న వ్యూహాలకు ముందుగానే చెక్‌పెట్టారు.
2 గంటల పాటు కాల్పులు: ఇన్‌చార్జి ఎస్పీ
కదంబా అడవుల్లో పోలీసులకు, దళ సభ్యులకు మధ్య 2 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఘటన స్థలంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. 'ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాస్కర్ దళం సంచరిస్తుందనే సమాచారంతో కూంబింగ్ విస్తృతం చేశాం. 5 రోజుల్లో సిర్పూర్(యూ) మండలం కాకరబుద్ది, తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో మూడు సార్లు తప్పించుకున్నారు. దీంతో వారి కదలికలను గుర్తించి ముమ్మరంగా కూంబింగ్ చేయగా కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో దళ సభ్యులు తారసపడ్డారు. ఆయుధాలతో ఉన్న వారిని చూసి లొంగిపోవాలని పోలీసులు అంటుండగానే దళ సభ్యులు విచè క్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసు లు వెంటనే పొజిషన్ తీసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసులకు ఎవరికీ గాయాలు కాలేదు. తప్పించుకున్న కీలక సభ్యులు ఇక్కడే కిలోమీటరున్నర పరిధిలోనే ఉన్నారు. వారి కోసం బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి'అని తెలిపారు.
పట్టుకుని కాల్చి చంపారు: మావోలు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చి న కామ్రేడ్లను పోలీసులు నిర్దాక్షిణ్యంగా పట్టుకుని కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఆదివారం సాయంత్రం కేబీఎం కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. 'ఈ ఎన్‌కౌంటర్ బూటకం. కామ్రేడ్‌లు చుక్కాలు, బాదిరావులు తమ ప్రాణ త్యాగంతో మరోసారి ఉమ్మడి జిల్లాలో విప్లవ కేతనం ఎగరేశారు. భారత దోపిడీ పాలకులు 2022 నాటికి విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు ఆపరేషన్ సమాధాన్‌తో తెలంగాణలోనూ అణచివేత తీవ్రతరం చేశారు. కార్డన్ సెర్చ్ పేరుతో గ్రామాల్లో సోదాలు, అక్రమ అరెస్టులు చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా చిత్రహింసలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు శిక్షలు తప్పవు' అని లేఖలో హెచ్చరించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire