Telangana: విద్యుత్ వినియోగదారులకు షాక్..మళ్లీ పెరగనున్న కరెంట్ ఛార్జీలు

Electricity charges in TG are likely to rise once again in the state
x

Telangana: విద్యుత్ వినియోగదారులకు షాక్..మళ్లీ పెరగనున్న కరెంట్ ఛార్జీలు

Highlights

Electricity Charges Revise : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ చార్జీలను సవరించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్ధిక ఏడాదికి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300యూనిట్లు దాటితే స్థిరఛార్జీ కిలోవాట్ కు 40 రూపాయలు పెంచాలంటూ కోరాయి. 80శాతానికి పైగా ఇండ్లకు 300 యూనిట్లలోపే ఉండటం వల్ల ఎలాంటి భారం ఉండదని డిస్కంలు వివరించాయి.

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు మరోసారి షాక్ తగలనుంది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షి ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి అందించాయి. మూడు కేటగిరిల్లో ఛార్జీలను సవరించాలంటూ ప్రతిపాదించాయి. వీటిని ఈఆర్సీ ఆమోదించినట్లయితే లోటును పూడ్చుకోవడానికి రూ. 1200కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనాలపై రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపిన అనంతరం ఈఆర్సీ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.

ఈఆర్సీ తుది నిర్ణయం అనంతరమే ఛార్జీల సవరణ అమల్లోకి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు 90 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222కోట్లుగా ఉంటున్నట్లు అంచనా. ఈ మొత్తంలో 13వేల 22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగిలిన 1200కోట్ల లోటును పూడ్చేందుకు ఛార్జీల ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు వెల్లడించాయి.

ఇక ఇండ్లకు వాడుకునే కరెంటు ఛార్జీలు నెలకు 300 యూనిట్లు దాటినట్లయితే కిలో వాట్ కు స్థిర ఛార్జీని ప్రస్తుతం 10 వసూలు చేస్తుండగా..50 రూపాయలకు పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరినట్లు సమాచారం. ప్రభుత్వం గ్రుహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకునే ఇండ్లకు ఫ్రీగా సరఫరా చేస్తోంది అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇండ్లకు ఎలాంటి స్థిర ఛార్జీ పెంపు ఉండదు. రాష్ట్రంలో మొత్తం కోటీ 30లక్షలకు పైగా ఇండ్లకు కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 300యూనిట్ల లోపు వాడుకునేవారు 80శాతానికి పైగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories