Electoral Bonds Issue: ఎలక్టోరల్ బాండ్‌ల కేసులో ఎస్‌బీఐకి ఎదురుదెబ్బ..

Electoral Bond Case Cji Dy Chandrachud Warns Sbi
x

Electoral Bonds Issue: ఎలక్టోరల్ బాండ్‌ల కేసులో ఎస్‌బీఐకి ఎదురుదెబ్బ.. 

Highlights

Electoral Bonds Issue: సీల్డ్ కవర్ తెరిచి ఈసీకి ఇస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు

Electoral Bonds Issue: ఎలక్టోరల్ బాండ్‌ల కేసులో ఎస్‌బీఐకి చుక్కెదురైంది. వివరాలు ఇచ్చేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలని కోరిన ఎస్‌బీఐ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. మార్చి 15లోపు బాండ్ల వివరాలు అప్‌లోడ్ చేయాలని ఈసీఐకి ఆదేశాలిచ్చింది. బాండ్లు ఇచ్చిన వారు, స్వీకరించిన వారి వివరాలు.. పూర్తిగా జతచేసేందుకు మరింత సమయం పడుతుందని ఎస్‌బీఐ తరపు న్యాయవాది సాల్వే తెలిపారు.

అయితే ప్రొసీజర్ ఫాలో కావాల్సిన అవసరం లేదని.. సీల్డ్ కవర్ తెరిచి ఈసీకి ఇస్తే చాలని వ్యాఖ్యానించారు సీజేఐ చంద్రచూడ్. బాండ్ల వివరాల విషయంలో 26 సంవత్సారాలుగా ఏం చేశారంటూ నిలదీశారు. కనీసం ఈ 26 రోజుల్లో ఏం చేశారో కూడా తమకు సమర్పించలేదని అసహనం వ్యక్తం చేశారు. తామిచ్చిన తీర్పును ఫాలో అవ్వాలంటూ.. వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ.. ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories