D Sudheer Reddy: రాజకీయ పునరావాసాలకు ఎల్బీనగర్ అడ్డా కాదు

Election Campaign Of LB Nagar BRS Candidate
x

D Sudheer Reddy: రాజకీయ పునరావాసాలకు ఎల్బీనగర్ అడ్డా కాదు

Highlights

D Sudheer Reddy: నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

D Sudheer Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధి మన్సూరాబాద్ డివిజన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 40 కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుందని, పలు కాలనీల నుంచి ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క ఇంటికీ చేరాయని అన్నారాయన... రాజకీయ పునరవాసాలకు ఎల్బీనగర్ అడ్డా కాదని ప్రతిపక్షాలను విమర్శించారు.. ప్రజల సమస్యతో.. ప్రజలకు సేవ చేసిన వ్యక్తులకే ఇక్కడ అవకాశం ఉంటుందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories