Education with WhatsApp: వాట్సాప్ తో విద్యాబోధన.. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం

Education with WhatsApp: వాట్సాప్ తో విద్యాబోధన.. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం
x
Highlights

Education with WhatsApp:వాట్సాప్ అనేది మానవ జీవితంలో భాగమవుతోంది..

Education with WhatsApp:వాట్సాప్ అనేది మానవ జీవితంలో భాగమవుతోంది... ఇప్పటికే అన్ని కంపెనీలు, స్నేహితులు ఇలా అన్ని వర్గాల వారు ఈ యాప్ ను వినియోగించుకుని తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. నిద్ర లేచిందే మొదలు వాట్సాప్ చూసిన తరువాత దేవుణ్ని తలుచుకునే రోజులుగా మారాయంటే దాని ఎంత మేరకు వినియోగించుకుంటున్నారో్ అర్థం అవుతుంది. తాజాగా తెలంగాణా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు చెప్పే విధంగా వాట్సాప్ ను వినియోగించేందుకు శ్రీకారం చుట్టారు.

వాట్సప్… వాట్సప్.. గతంలో ఇది సరదా యాప్. కుటుంబ సభ్యులు, స్నేహితులు, లైక్ మైండెడ్ పీపుల్.. అంతా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా మెట్రో సిటీల్లోని కార్పోరేట్ కంపెనీల్లోని ఉద్యోగుల అనుసంధాన వారధిగా మారిపోయింది. ఇందులో ఉన్నత ఉద్యోగులు తమ కింది వారి పనిని అప్ డేట్ చేసుకునేందుకు వినియోగించేవారు.

ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఉద్యోగం ఇంటికే మారిపోయింది. నాన్న ఇంట్లో నుంచే.. అమ్మ ఇంట్లో నుంచే.. ఇక పిల్లల చదువులు ఇంటి నుంచే సాగుతున్నాయి. అయితే వీరందరిని కలిపేది మాత్రం వాట్సప్ యాప్. ఇదంతా నిన్నటి వరకు మెట్రో నగరాల్లోని పరిస్థితి.

ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకే పరిమితమైన వాట్సాప్‌ పర్యవేక్షణ… ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలకూ చేరింది. కరోనా నేపథ్యం లో విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్‌లైన్‌ లేదా టీవీల ద్వారా పాఠ్యాంశ బోధనకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 27 నుంచి విధులకు హాజరవుతున్న టీచర్లు.. తమ తరగతి విద్యార్థుల పర్యవేక్షణకు సామాజిక మాధ్యమాల వాడకాన్ని విస్తృతం చేశారు.

ఇందులో భాగంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఒకటి క్రియేట్‌ చేసి.. క్లాస్‌ టీచర్‌ అడ్మిన్‌గా ఉంటూ విద్యార్థులను ఆ గ్రూప్‌లో సభ్యులుగా చేరుస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా బోధన కార్యక్రమాలను సాగిస్తుండగా, తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాట్సాప్‌ వాడకం అనివార్యమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories