Karvy: కార్వీ అక్రమాలపై దర్యాప్తు వేగవంతం

ED Speedup the  Karvy Case Investigation
x

కార్వీ కేసు విచారణ వేగవంతం చేసిన ఈడీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Karvy: నిధుల మళ్లింపుపై లోతుగా ఆరా తీస్తున్న ఈడీ

Karvy: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అక్రమాలపై దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. కార్వీ నిర్వాహకుల నిధుల మళ్లింపు అక్రమాలపై లోతుగా ఆరా తీస్తోంది. వినియోగదారుల షేర్లను అక్రమంగా బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రుణంగా తీసుకున్న కోట్ల రూపాయల నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై కూపీ లాగుతోంది. ఇలా సేకరించిన రుణాల మొత్తం 12వందల కోట్లకు పైగానే ఉంటాయని తేలడంతో ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది.

చంచల్‌గూడా జైలులో ఉన్న పార్థసారధిని ఇప్పటికే విచారించిన ఈడీ అతని వద్ద నుంచి వివరాలు సేకరించింది. వాటి ఆధారంగా ఏకకాలంలో కార్వీ కార్యాలయాలపై దాడులు నిర్వహించి, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. స్టాక్ మార్కెట్ లావాదేవీల నిర్వహణ నెపంతో వినియోగదారులకు సంబంధించిన షేర్లపై అదుపు సంపాదించిన సంస్థ.. వినియోగదారులకు తెలియకుండానే ఆ షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టింది. భారీ మొత్తంలో రుణాలు పొందింది. దీనిపై సెబీకి ఫిర్యాదులు రావడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

బ్యాంకుల తనఖాలో ఉన్న షేర్లను విడిపించి వినియోగదారులకు ఇప్పించేలా సెబీ చర్యలు తీసుకోవడంతో తాము మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించాయి బ్యాంకులు. దీంతో కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ కార్వీ నిర్వాహకుల నిధుల మళ్లింపు అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. వినియోగదారుల షేర్లను అక్రమంగా బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా రుణంగా తీసుకున్న కోట్ల నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై కూపీ లాగుతోంది. ఈ క్రమంలోనే K.S.L. సంస్థ నిర్వాహకుల కనుసన్నల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలను ఆరా తీస్తోంది.

మరోవైపు దాదాపు 40 కంపెనీలతోపాటు కొన్ని స్టాక్ ట్రేడింగ్ సంస్థల పైనా ఈడీ కన్నేసింది. ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీల గుట్టు తేల్చడంలో నిమగ్నమైంది. కార్వీ అక్రమాలపై ఇప్పటికే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దర్యాప్తు చేసిన నేపథ్యంలో.. అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించడంపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. S.A.O. ఇప్పటికే K.A.L. అధీనంలోని సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి 5 లక్షలకన్నా ఎక్కువగా జరిగిన లావాదేవీల గురించి సమాచారం సేకరించడంతో.. ఆ సమాచారం తెప్పించుకునేందుకు ఈడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఈడీ సేకిరించిన సమాచారంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ నిర్వాహకుల ఆఫీసులు, ఇళ్లల్లో ఈడీ బృందాలు ముమ్మరంగా సోదాలు చేపట్టాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోనూ ఈ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్‌లో ఏడు బృందాలు చేపట్టిన సోదాల్లో.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. HDFC, ICICI, INDUS IND బ్యాంక్‌ నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా రుణం పొందిన సంస్థ.. వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించారనే కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories