రేవంత్ పై ఈడీ సంచలన అభియోగాలు: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

రేవంత్ పై ఈడీ సంచలన అభియోగాలు: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం
x

రేవంత్ పై ఈడీ సంచలన అభియోగాలు: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం

Highlights

Cash for vote scam : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మనీలాండరింగ్ కు పాల్పడ్డారనేందుకు ఆధారాలున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు.

Cash for vote scam : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మనీలాండరింగ్ కు పాల్పడ్డారనేందుకు ఆధారాలున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు.ఓటుకు నోటు కేసులో రూ. 50 లక్షలతో రేవంత్ రెడ్డి 2015లో ఏసీబీ పట్టుబడ్డారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ పిఎంఎల్ఏ కింద దాఖలు చేసిన చార్జీషీట్ లో ఆయనను ఏ1గా ఈడీ అధికారులు చేర్చారు. ఈ విషయమై 2019లో ఆయనను ప్రశ్నించిన సమయంలో తమ ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు.

2015 జూన్ 1న తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు ముందు అప్పట్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఓటు వేసేందుకు నామినేటేడ్ ఎమ్మెల్సీ ఎల్విన్ స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కేసును 2018లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. స్టీఫెన్ సన్ , ఇతరుల స్టేట్ మెంట్ లను రికార్డ్ చేసింది ఈడీ. అదే ఏడాదిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పీఎంఎల్ఏలోని సెక్షన్ 50 కింద వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఎల్విన్ స్ఠీఫెన్ సన్ తనను కలవమని రేవంత్ రెడ్డి తనకు చెప్పారని... వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ లో ఓటు చేయాలని చెప్పినట్టు నిందితుల్లో ఒకరైన మత్తయ్య జెరూసలేం ధృవీకరించారు. పీఎంఎల్ ఏలోని సెక్షన్ 50 కింద ఈ వాంగ్మూలం రికార్డ్ చేశారు. టీడీపీ అభ్యర్ధి నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్ కు గైర్హాజరైతే రూ. 3 కోట్లు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన ఆ స్టేట్ మెంట్ లో వివరించారు.

2019 ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి సహాయకుడిగా ఉన్న రుద్ర ఉదయ్ సింహాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కొందరు పోలీసులు బలవంతంగా అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లారని తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి గన్ మెన్లు మాత్రం ఇలాంటి ఘటన జరిగినట్టు నివేదించలేదని ఈడీ అధికారులు చెప్పారని హిందూస్థాన్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది.

స్టీఫెన్ సన్ ఇంట్లో డబ్బులతో ఉన్న వీడియోను రేవంత్ రెడ్డికి చూపిన సమయంలో ఈ వీడియోపై రేవంత్ రెడ్డి సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని ఈడీ అధికారులు చెప్పారు. ఓ వ్యక్తి తన మాదిరిగానే వీడియోలో కన్పిస్తున్నారని చెప్పారన్నారు.

రేవంత్ రెడ్డి మనీలాండరింగ్ లో పాల్గొన్నారని పీఎంఎల్ఏ దర్యాప్తులో తేలింది. సెక్షన్ 3, సెక్షన్ 4 కింద నేరం. ఒక అభ్యర్ధికి ఓటు చేయడానికి రూ. 50 లక్షలు చెల్లించడం మనీలాండరింగ్ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఈడీ అధికారులు కోర్టుకు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories