Sheep Distribution scam: తెలంగాణలో గొర్రెల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ

ED has entered the field on the sheep scam in Telangana
x

Sheep Distribution scam: తెలంగాణలో గొర్రెల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ

Highlights

Sheep Distribution scam: రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు

Sheep Distribution scam: తెలంగాణలో గొర్రెల స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో ఈడీ ఎంటరైంది. భారీగా డబ్బులు మారడం, రాజకీయ నాయకులు ప్రమేయం ఉందనే ప్రచారంతో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించనుంది ఈడీ.

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ లేఖ రాశారు. ఇదే స్కామ్‌లో ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈడీ కూడా ఎంట్రీ ఇస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.

గొర్రెల స్కీమ్‌లో భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తాయి. మరో వైపు ఇతర రాష్ట్రాల్లోనూ లింకులు ఉండడంతో.. మనీలాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు అకౌంట్ల వివరాలు లాంటి సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.

గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏయే అకౌంట్లలో క్రెడిట్ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, వాటిని ఏయే లబ్ధిదారులకు పంపించారు, దీని కోసం ఎవరికెన్ని నిధులిచ్చారనే దానిపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories