Formula E Car racing: కేటీఆర్‌కు మరో షాక్.. FEMA, PMLA చట్టాల కింద కేసు నమోదు చేసిన ఈడీ

Formula E Car racing: కేటీఆర్‌కు మరో షాక్.. FEMA, PMLA చట్టాల కింద కేసు నమోదు చేసిన ఈడీ
x
Highlights

ED files case on KTR in Formula E Car racing Scam case: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేటీఆర్‌పై కేసు...

ED files case on KTR in Formula E Car racing Scam case: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. ఇదే విషయంలో నిన్న గురువారం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసు వివరాలు ఇవ్వాల్సిందిగా ఇవాళ ఉదయమే (డిసెంబర్ 20) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ యూనిట్ అధికారులు ఏసీబీ అధికారులకు ఓ లేఖ రాశారు. వారు ఇచ్చిన వివరాల ఆధారంగానే తాజాగా ఈడీ కూడా కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది.

ఫార్మూలా-ఈ కార్ రేసింగ్ (Formula E Car racing) నిర్వహణకు ముందుకొచ్చిన విదేశీ కంపెనీలకు డాలర్లలో చెల్లింపులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. అయితే, లెక్క ప్రకారం ప్రభుత్వం తరపు నుండి భారీ మొత్తంలో విదేశీ మారకంలో చెల్లింపులు జరిపే సందర్భంలో ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో అప్పుడు ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారాన్ని ముందుండి నడిపించిన కేటీఆర్ ఆ కనీస నిబంధన కూడా పాటించలేదనే ఆరోపణ కూడా ఉంది.

ఒకవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయనే ఆరోపణ ఒకటయితే.. ఇందులో విదేశీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారనేది మరో ఆరోపణ. ఈ కారణంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఫెమా చట్టం, పీఎంఎల్ఏ చట్టం (FEMA Act, PMLA Act) కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో ఈ కేసు (ED files FIR on KTR) మరో మలుపు తిరిగే అవకాశం లేకపోలేదని లీగల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories