Election Commission: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కసరత్తు

EC Exercise To Increase Voter Turnout
x

Election Commission: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కసరత్తు

Highlights

Election Commission: తక్కువ ఓటింగ్ నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి

Election Commission: తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ఓటింగ్ శాతం తగ్గడంపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ దిశా నిర్దేశం చేసింది. అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోక్ సభలో ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేస్తోంది ఎలక్షన్ కమిషన్.

దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాదికి ముందు నుంచి ఓటింగ్ శాతం అధికంగా నమోదు కావడానికి అనేక కార్యక్రమాలను ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికీ ఓటర్లను పోలింగ్ బూత్ లోకి రప్పించడంలో సక్సెస్ కాలేకపోయిందన్న విమర్శ ఎలక్షన్ కమిషన్ పై ఉంది. ఓటర్లు డబ్బు ప్రలోభాలకు గురికాకూడదని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కజిగిరి పార్లమెంట్ స్థానాల్లో ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకు పైచిలుకు పోలింగ్ కేంద్రాలు ఉంటే, 5000 పైచిలుకు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అయినట్టు ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జరగబోయే లోక్ సభ ఎన్నికల లో ఓటింగ్ శాతం పెంచేందుకు మరోసారి ప్రయత్నం చేస్తోంది ఎలక్షన్ కమిషన్.

ఇక దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన రాష్ట్రాలు దాదాపు 11 రాష్ట్రాలు ఉంటే అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. వలసలు, ఎక్కువ సేపు క్యూలో వేచి ఉండటమే తక్కువ ఓటింగ్ కు కారణమని ఎన్నికల సంఘం భావిస్తోంది.. ఓటరు భాగస్వామ్యాన్ని పెంచడం కోసం పాటలను రూపొందించి వాటిని వినిపించేందుకు దాదాపు 1,500 స్వచ్ఛ ఆటోలు ఉపయోగిస్తోంది. . మొబైల్ ఫోన్ల ద్వారా ఓటర్లను బూతీకు ఆహ్వానిం చేందుకు యువతను నియమించనున్నామని ఎన్నికల కమిషన్ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories