సింగరేణికి..పండగొచ్చింది..!

సింగరేణికి..పండగొచ్చింది..!
x
Highlights

సింగరేణిలో రెండు రోజుల ముందే పండగొచ్చింది. ఇప్పటికే దసరా అడ్వాన్స్ కార్మికుల ఖాతాల్లో జమవగా.. నవంబరు నెలలో దీపావళి బోనస్ అందియించనున్నారు.

సింగరేణిలో రెండు రోజుల ముందే పండగొచ్చింది. ఇప్పటికే దసరా అడ్వాన్స్ కార్మికుల ఖాతాల్లో జమవగా.. నవంబరు నెలలో దీపావళి బోనస్ అందియించనున్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికులను చిన్నచూపు చూస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సింగరేణి కార్మికుల కష్టాలను తెలుసుకొని తమకు సరైన న్యాయం చేశారంటున్నారు కార్మికులు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు చెల్లిస్తున్నలాభాల బోనస్ పై ‍హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

సింగరేణి ప్రాంతాల్లో రెండురోజుల ముందే పండగవాతావరణం నెలకొంది. ఇప్పటికే 25 వేల చొప్పున దసరా అడ్వాన్స్ అందుకున్న సింగరేణి కార్మికులకు లాభాలవాటాతో పాటు మార్చినెలలో కోత విధించిన సగం వేతనాలను బ్యాంకు అకౌంట్లో యాజమాన్యం జమ చేసింది. మరో 20 రోజుల్లో దీపావళి బోనస్ కూడా అందనుంది. మొత్తంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సుమారు 850 కోట్ల ఆర్థిక ప్రయోజనాలను అందుకోనున్నారు సింగరేణి కార్మికులు. దీంతో కార్మిక కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

మరోవైపు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికుల వాటాను యాజమాన్యం కార్మికుల బ్యాంకు అకౌంట్లలో జమచేసింది. 993 కోట్ల సింగరేణి లాభాల్లో ప్రభుత్వం కార్మికులకు 28 శాతం వాటాను ప్రకటించింది. దీంతో వాటా రూపంలో 278.28 కోట్లు అందనున్నాయి. ఒక్కోకార్మికుడికి 50 వేల వరకు వాటా మొత్తం అందింది. అలాగే మార్చి నెలకు సంబంధించిన వేతన బకాయిలు 158 కోట్లు సైతం ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లో జమయ్యాయి.

సింగరేణిలో ప్రతి ఏటా కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. సంస్థలో పనిచేసే ప్రతి పర్మినెంట్ కార్మికుడికి ఈసారి 25 వేల చొప్పున, బదిలీ వర్కర్ కు 12,500 చొప్పున వారి అకౌంట్లలో సింగరేణి యాజమాన్యం ఇప్పటికే జమ చేసింది. దేశంలోని బొగ్గు పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్యాలు ప్రతి ఏటా ఇచ్చే పీఎల్ఆర్ ను ఈ దఫా 68 వేల 500గా నిర్ణయించింది. వచ్చే దీపావళి పండుగకు ముందు నవంబర్ రెండో వారంలో కార్మికులకు దీపావళి బోనస్ రూపంలో 332 కోట్లు చెల్లించనుంది.

మరోవైపు సింగరేణి కార్మికులు మాత్రం గతంలో aituc, intuc సంఘాలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం 10 నుండి 16 శాతం మాత్రమే లాభాల బోనస్ ఇచ్చేవారని ఇప్పుడు tbgks అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి 28 శాతం లాభాల బోనన్ ను అందిస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ కి గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories