నిండు కుండలా హుస్సేన్ సాగర్

నిండు కుండలా హుస్సేన్ సాగర్
x
హుసేన్ సాగర్ ఫైల్ ఫోటో
Highlights

Hussain Sagar Water Level : హైదరాబాద్ నగరం మధ్యలో సుందరంగా కనిపించే హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చేస్తోంది.

Hussain Sagar Water Level : హైదరాబాద్ నగరం మధ్యలో సుందరంగా కనిపించే హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చేస్తోంది. న‌గ‌రంలో ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వాన‌ల‌కు హుస్సేన్‌సాగ‌ర్‌ ట్యాంక్ బండ్ నిండుకుండలా మారుతుంది. గంటగంటకూ సాగర్ లో నీరు పెరుగుతున్న క్రమంలో GHMC అధికారులు 24 గంటలుగా పరిశీలిస్తున్నారు. సాగ‌ర్ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 513.41 అడుగులుకాగా, ప్ర‌స్తుతం 513.64 అడుగుల నీరు చేరింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు వారితో పాటు సరస్సుల ఎమర్జెన్సీ టీమ్ కూడా ట్యాంక్ బండ్ ను పరిశీలిస్తున్నారు.

హుస్సేన్ సాగర్‌లో చేరిన వరద నీరు ఎప్పటకప్పుడు పెరుగుతుండడంతో రెండు అలుగులు, తూముల ద్వారా వ‌చ్చిన నీటిని వ‌చ్చిన‌ట్లు వ‌దిలేస్తున్నారు. అలుగులు, తూముకు చెత్త అడ్డుపడుతోంది. తూమ్‌ల‌లో చిక్కుకు‌న్న చెత్త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సిబ్బంది తొల‌గిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో చెత్త ఎప్పటికప్పుడు తూమ్ లలో చిక్కుకుంటుంది. రోడ్లపై నీరు నిలిచిపోకుండా చేస్తున్నాయి. హైదరాబాద్‌లో కంటిన్యూగా వర్షాకాల ఎమర్జెన్సీ, DRF బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. ఎక్కడైనా చెట్లు, కొమ్మలు కూలితే వెంటనే క్లియర్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయి అధికారులను GHMC అప్రమత్తం చేసింది.

ఇక పోతే రాష్ట్రంలో శనివారం బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం వల్ల తీవ్రత మరింత పెరుగుతుందని, ఉత్తర తెలంగాణ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని ఇక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిమీ ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలన్నీ జలదిగ్బంధంలో ఉండిపోయాయి. రహదారులపై వరదనీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువులు, వాగులు, నదులన్నీ ఎక్కడికక్కడ నిండి పొంగి పొరలుతున్నాయి.




Show Full Article
Print Article
Next Story
More Stories