Dubbaka by Elections: హీట్ పుట్టిస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక సమరం

Dubbaka by Elections: హీట్ పుట్టిస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక సమరం
x
Highlights

Dubbaka by Elections: తెలంగాణ పాలిటిక్స్‌ ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎదుగుతున్న క్రమంలో జరుగుతున్న ఈ ఉపఎన్నికతో జనం దృష్టి దుబ్బాకపై పడింది. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉపపోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది.

తెలంగాణ పాలిటిక్స్‌ ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎదుగుతున్న క్రమంలో జరుగుతున్న ఈ ఉపఎన్నికతో జనం దృష్టి దుబ్బాకపై పడింది. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉపపోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది.

రఘునందన్‌ రావు మామ ఇంట్లో నగదు దొరకిన తర్వాత దుబ్బాకలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రధానంగా పోలీసులే ఆ నగదు ఉంచారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌పై పోలీసులు అవమానకరంగా ప్రవర్తించడం ఆయన్ను గాయాలపాలు చేయడంపై ఈసీకి లేఖ రాశారు బీజేపీ నేతలు. దీంతో జిల్లా కలెక్టర్‌ తీరుపై మొదటి నుంచి గుర్రుగానే ఉన్న కమళనాథులు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ రెడ్డిని ట్రాన్స్‌ ఫర్‌ చేయించగలిగారు. దీంతో తమిళనాడుకు చెందిన ఐపీఎస్‌ అధికారి సరోజ్‌ కుమార్ థాకూర్‌ నియమితులయ్యారు.

అటు దుబ్బాక ఉప ఎన్నికలను కాంగ్రెస్‌ కూడా సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా దివంగత చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌ రెడ్డిని బరిలో నిలబెట్టింది. ముందేనుంచే పక్కాప్లాన్‌తో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పనిలో పనిగా దుబ్బాకలోని ప్రస్తుత పరిస్థితులపై ఈసీకి లేఖ రాసింది. దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని కోరింది. ఉప ఎన్నికలను స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు టీఆర్ఎస్, బీజేపీలు అక్రమ మార్గంలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

ఇక అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ గెలిచే పొజిషన్‌లో ఉన్నప్పటికీ కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు గులాబీ నేతలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా హరీష్‌ రావుకు ఇది ఒక రకంగా పరీక్షగా మారింది. చెప్పాలంటే 2014లో టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఏ ఉపఎన్నిక అయినా ఇప్పటివరకు టీఆర్ఎస్‌యే గెలిచింది. దీంతో తన శక్తి యుక్తులన్నీ చూపుతూ హరీష్‌ రావు నిర్విరామ ప్రచారం చేస్తున్నారు. ఏదీ ఏమైనా మూడు ప్రధాన పార్టీలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇది తెలిసిన విషయమే అయినా ముఖ్యంగా టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి, మంత్రి హరీష్‌రావుకు ప్రతిష్టాత్మకం అని చెప్పక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories