Hyderabad: ఓ చేత్తో బీరు సీసా, మరో చేత్తో సిగరెట్‌.. నాగోలులో యువతి హల్‌చల్‌

Drunken Young Women & Men Hulchul at Hyderabad
x

Hyderabad: ఓ చేత్తో బీరు సీసా, మరో చేత్తో సిగరెట్‌.. నాగోలులో యువతి హల్‌చల్‌

Highlights

Hyderabad: సీనియర్ సిటిజన్స్‌పై అసభ్యంగా ప్రవర్తించిన జంట

Hyderabad: మద్యం తాగుతూ ఓ యువతి, యువకుడు హల్‌చల్‌ చేశారు. నాగోలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్‌ పీర్జాదిగూడకు చెందిన అలెక్స్‌ బోడిచెర్ల (25) ఓ యువతితో కలిసి ఫతుల్లాగూడ 100 ఫీట్‌ రోడ్డుకు కారులో వచ్చారు. కారు ఆపి బీర్లు, సిగరెట్లు తాగుతూ హల్‌చల్‌ చేశారు. ఇదే సమయంలో ఆ రహదారిపై మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వాకర్స్‌ కలుగజేసుకుని వారిని హెచ్చరించారు. ఇలా బహిరంగంగా మద్యం తాగుతూ గొడవలు చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.

పోలీసులకు ఫోన్‌ చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. అడ్డుకుని దుర్భాషలాడారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన నాగోలు పోలీసులు.. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి, యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories