Dogs Eating Coronavirus Patients Dead Bodies: హైదరాబాద్‌లో దారుణం.. సగం కాలిన కరోనా బాధితుల శవాలను పీక్కుతిన్న కుక్కలు

Dogs Eating Coronavirus Patients Dead Bodies: హైదరాబాద్‌లో దారుణం.. సగం కాలిన కరోనా బాధితుల శవాలను పీక్కుతిన్న కుక్కలు
x
Highlights

Dogs Eating Coronavirus Patients Dead Bodies: ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో చాపకింద నీరులా వ్యాపించి లక్షల మందిని ఆస్పత్రుల పాలు చేయడం మాత్రమే కాకుండా వారి ప్రాణాలను కూడా కబలిస్తుంది.

Dogs Eating Coronavirus Patients Dead Bodies: ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో చాపకింద నీరులా వ్యాపించి లక్షల మందిని ఆస్పత్రుల పాలు చేయడం మాత్రమే కాకుండా వారి ప్రాణాలను కూడా కబలిస్తుంది. డ్రాగన్ దేశంలో పుట్టిన ఈ వైరస్ బతికున్న మనుషుల నుంచి మాత్రమే కాకుండా చనిపోయిన వారి నుంచి కూడా ఇతరులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు అంత్యక్రియల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడి ఆత్మీయులు చనిపోయినా చివరిసారి చూడటానికి వెళ్లలేని పరిస్థితి. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్లో ఉంటుండటంతో అంత్యక్రియలను కూడా మున్సిపాలిటీ సిబ్బంది చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మృతదేహాలను గుంతల్లోకి విసిరేస్తున్న వీడియోలు ఇటీవలే బయటకొచ్చాయి. కరోనా డెడ్ బాడీలను దహనం చేసినప్పుడు ఉదాసీనంగా వ్యవహరించిన ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి సంఘటనే ఇప్పుడు హైదరాబాద్ లోనూ చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలోని గాంధీ హాస్పిటల్‌లో కరోనాతో మృతిచెందిన వారి మృత దేహాలను ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో దహనం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి అధికారులు ప్రత్యేకంగా కొంత మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసారు.

కానీ అధికారులు ఏర్పాటు చేసిన సిబ్బంది. మృతదేహాలు పూర్తిగా కాలక ముందే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో అక్కడున్న కుక్కలు సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. ఇప్పుడు ఈ హృదయవిదారక దృశ్యాలు బయటకొచ్చాయి. ఓ వ్యక్తి తన తాతయ్య అస్థికల కోసం శ్మశానానికి రాగా..సగం కాలిన డెడ్ బాడీలను కుక్కల పీక్కుతినడం చూసి షాకయ్యారు. చనిపోయిన వారి వివరాలను నమోదు చేయడం, అంత్యక్రియలను జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తోంది. మృతదేహాలు కాలే వరకూ చూడాల్సిన బాధ్యత మాది కాదంటే మాది కాదని శ్మశాన వాటిక నిర్వాహకులు, జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories