కరోనా అందరికీ ప్రాణాంతకం కాదు!

కరోనా అందరికీ ప్రాణాంతకం కాదు!
x
representative image
Highlights

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా అనే పదం వినిపిస్తే చాలు జనాలు వణికిపోతున్నారు. ఈ వైరస్ సోకిన వారందరికి ప్రాణాంతకం కాదని వైద్య...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా అనే పదం వినిపిస్తే చాలు జనాలు వణికిపోతున్నారు. ఈ వైరస్ సోకిన వారందరికి ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటి పవర్, మనోధైర్యం ఉంటే ఈ వైరస్ ను జయించవచ్చు అంటున్నారు వైద్యులు. అంతేకాదు ఏదైనా అనారోగ్యం ఉన్న వారిలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే కరోనాను జయించవచ్చు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ఎక్కువ ప్రమాదం. కరోనా నుంచి కోలుకున్న వారిలో 28శాతం మంది 50 ఏళ్లు దాటిన వారే.

కరోనా వైరస్ తో ప్రపంచం అల్లాడిపోతుంది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది మృతి చెందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. కరోనా సోకిన వారందరూ భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ బారిన పడిన వారందరికి ప్రాణాంతకంగా మారదంటున్నారు వైద్యులు. శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే కరోనా ను జయించవచ్చంటున్నారు. ఏదైనా అనారోగ్యం ఉంటే తప్ప కరోనా అంత ప్రమాదకరం కాదంటున్నారు.

కరోనా వైరస్ సోకిన వారిలో అత్యధికంగా 60ఏళ్లు దాటిన వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వయసు వారిలో ఎక్కువగా రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బులాంటివి ఉంటే అందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. అయితే ఈ వ్యాధులు లేని వారు కరోనాను జయించి ఇళ్లకు వెళ్లవచ్చని చెప్తున్నారు.

ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరల్లోంచి కోలుకున్నా చాలా మందిలో ఈ జబ్బులు లేవని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటివరకు 50 ఏళ్లు దాటిన వారు దాదాపు 28 శాతం మంది కోలుకున్నారు. 61 ఏళ్లు నిండినవారు 11 శాతం మంది కోలుకున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో 46శాతం మంది కరోనా ను జయించినట్టు తెలుస్తోంది. వీరికి రోగనిరోధక శక్తి అధికంగా ఉండడమే కారణం.

వైరస్ నిర్ధారించిన 14 రోజుల్లోనే కోలుకున్న వారిలో 8 నుంచి 9 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలతో పాటు 19 ఏళ్ల యువకుడు ఉన్నాడు. ఆస్పత్రిలో చేరిన వారిలో అత్యధికులు పూర్తి ఆరోగ్యవంతులు కోలుకుంటున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిలో మధుమేహం, గుండెజబ్బుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఉన్నాట్టు తెలుస్తోంది.

మొత్తానికి వైరస్ సోకిన వారిలో 81శాతం మందిలో లక్షణాలు బయటకు కనిపించకుండానే వెళ్లిపోతుంది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత దూరం పాటించాలి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలి వీటితో పాటు మనోధైర్యంగా ఉంటే ఎలాంటి రోగాన్నైనా జయించవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories