హెచ్ఎం సమయస్ఫూర్తితో విద్యార్థికి తప్పిన అపాయం

హెచ్ఎం సమయస్ఫూర్తితో విద్యార్థికి తప్పిన అపాయం
x
Highlights

ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్యాబుద్ధులను నేర్పించడం మాత్రమే కాదు వసతి గృహంలో ఉన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడతారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్యాబుద్ధులను నేర్పించడం మాత్రమే కాదు వసతి గృహంలో ఉన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడతారు. పిల్లలకు కష్టం కలిగినా, దుఖం కలిగినా వారి సొంత పిల్లలలాగా ఆదరిస్తారు. విద్యార్థలు ప్రాణాపాయంలో ఉంటే వారిని ప్రాణాపాయం నుంచి తప్పించి బతికిస్తారనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే ఖమ్మం జిల్లాలోని దబ్బతోగు గ్రామానికి చెందిన మల్లం లక్ష్మి అనే విద్యార్థిని బీమునిగూడెం ఐటీడీఏ బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంటుంది. పదో తరగతి పరీక్షలు సమయం దగ్గరవుతుండడంతో విద్యార్థిని శ్రద్దగా చదువుకునేది. భవిష్యత్తులో తాను ఎదగాలంటే మంచి చదువులు చదవాలని నిర్ణయించుకున్న విద్యార్థిని సిలబస్ మీద పట్టు సాధించేందుకు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాలని అనుకుంది.

ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం అశ్వారావుపేట మండలంలోని అనంతారం గ్రామంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చేరింది. అప్పటి నుంచి అక్కడే చదువుకుంటున్నవిద్యార్థికి గురువారం రాత్రి ఉన్నట్టుంది ఒక్కసారిగా కడుపునొప్పి మొదలయింది. నొప్పి తీవ్రతను తట్టుకోలేని విద్యార్థిని ఇక్క సారిగా కుప్ప కూలింది. దీంతో అక్కడున్న తోటి విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎం అజ్మీర కృష్ణకుమారికి సమాచారం అందించారు. దీందో హెచ్ ఎం తక్షణమే వైద్యం చేయించడానికి తన కారులోనే గుమ్మడవల్లి ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు.

అయినప్పటికీ నొప్పి తీవ్రత పెరగడంతో వెంటనే వైద్యుల అశ్వారావుపేట పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హెచ్ ఎం వెంటనే అక్కడినుంచి అశ్వారావుపేల వైద్యాశాలకు తీసుకెల్లి పరీక్షలు చేయించారు. అనంతరం వైద్యులు విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఆమెను హుటాహుటిన సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తరువాత అక్కడి వైద్యులు విద్యార్థినిని పరీక్షించి ఆమె కడుపులో కణితి ఉందని, వెంటనే శస్త్ర చికిత్స చేయాలని తెలిపారు.

దీంతో హెచ్‌ఎం విద్యార్థి ప్రాణాలను కాపాడడానికి అన్ని తానై దగ్గరుండి శస్త్ర చికిత్స చేయించింది. దీంతో విద్యార్థిని కడుపులో నుంచి కేజీ బరువు ఉన్న కణితిని తొలగించారు. దీంతో విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇక పోతే ఇంత మంచి పని చేసి విద్యార్థిని ప్రాణాలను కాపాడిని హెచ్ ఎంని అధికారులు అభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories