Hyderabad: పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.700 కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన సంస్థ

DKZ Technologies in Madhapur Cheated Over 18,000 Investors in Rs 700 Crore Fraud
x

Hyderabad: పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. రూ.700 కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన సంస్థ

Highlights

Hyderabad: హైదరాబాద్‌ మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం జరిగింది.

Hyderabad: హైదరాబాద్‌ మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం జరిగింది. డీకేజెడ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ బోర్డు తిప్పేసి 700 కోట్లు కాజేసింది. మూడు రాష్ట్రాల్లో ఈ సంస్థ మోసాలకు పాల్పడింది. హైదరాబాద్‌ వ్యాప్తంగా 18వేల మంది బాధితులు ఉన్నారు. కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని మోసాలకు పాల్పడ్డారు. నిర్వాహకులు500 కోట్ల వరకు వసూల్‌ చేసినట్లు బాధితులు తెలిపారు.

మొదట పెట్టుబడి పెట్టిన వాళ్లకి నిర్వాహకులు వడ్డీ రూపంలో డబ్బు చెల్లించారు. ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తుండటంతో బాధితులు వేల మందిని పెట్టుబడి పెట్టించారు. గత రెండు నెలల నుంచి డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో నిర్వాహకులను బాధితులు నిలదీశారు. దీంతో నిర్వాహకులు ఆఫీస్‌కు తాళం వేసి పారిపోయారు. మోస పోయామని తెలుసుకున్న బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories