DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు ద్రోహం చేశాయి

DK Aruna Latha Comments On BRS And Congress Partys
x

DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు ద్రోహం చేశాయి

Highlights

DK Aruna: రెండు పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలి

DK Aruna: రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అధికారంలోకి రావాలని చూస్తోన్న కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో జుక్కల్ బీజేపీ అభ్యర్థి అరుణ తార నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడారు. నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాటిని నెరవేర్చకపోగా... లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్నారు.

రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తోందని ఆమె విమర్శించారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడించి.. తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories