పెబ్బేరులో ఉద్రిక్తం.. డీకే అరుణ అరెస్ట్‌

పెబ్బేరులో ఉద్రిక్తం.. డీకే అరుణ అరెస్ట్‌
x
Highlights

మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్..

మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల ఎల్లూరు వద్ద నీట మునిగిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్ఐ) ప్రాజెక్టు దగ్గర పైపులు పేలడంతో పరిశీలించడానికి వెళుతున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లా పెబ్బేర్ వద్ద పోలీసులు డీకే అరుణను అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులకు బీజేపీ పార్టీ కార్యకర్తలకు మద్య వాగ్వివాదం జరిగింది.

ఎందుకు అడ్డుకున్నారంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరుణ కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రులను అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం పెబ్బేరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు బీజేపీ కార్యకర్తలను వెనక్కి పంపించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. అయితే వారు ససేమీరా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories