కరీంనగర్‌లో వింత సంప్రదాయం.. స్మశానంలో దీపావళి సంబరాలు

కరీంనగర్‌లో వింత సంప్రదాయం.. స్మశానంలో దీపావళి సంబరాలు
x
Highlights

సంవత్సరంలో రెండు రోజులు మాత్రం అక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. అందరూ ఇళ్ల దగ్గర దీపావళి జరుపుకుంటే కొందరు మాత్రం స్మశానంలో ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు.

ఆ ప్రాంతం.... నిత్యం విషాద ఛాయలు, వైరాగ్యపు భావనలు ఉండే చోటు.. కానీ సంవత్సరంలో రెండు రోజులు మాత్రం అక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. అందరూ ఇళ్ల దగ్గర దీపావళి జరుపుకుంటే కొందరు మాత్రం స్మశానంలో ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వింతైన సంప్రదాయం కరీంనగర్‌లో కనిపిస్తుంది. తమ పూర్వీకులను సమాధి చేసిన చోట దీపాలు వెలిగించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా కరీంనగర్ పట్టణంలో చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. స్మశానంలో దీపావళే కాదు తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలను కూడా వండుకుని స్మశానానికి తీసుకువస్తారు.

ఈ వేడుకల కోసం ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది లైటింగ్స్, త్రాగునీటిని ఏర్పాట్లు చేశారు కూడా.. పండగకు వారం రోజుల ముందే ఉండగానే స్మశాన వాటికల వద్ద అంత శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. ఇక ఈసారి కరీంనగర్ స్మశానాల్లో జరిగిన దీపావళి వేడుకలకు తెలంగాణ బీజేపీ అధ‌్యక్షుడు బండి సంజయ్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరితో కలిసి సమాధుల దగ్గరే బండి సంజయ్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పెద్దల స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలతో పండుగ జరుపుకునే మంచి సంప్రదాయం కరీంనగర్‌లో ఉందన్నారు బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories