Karimnagar: కరోనా వైరస్ నివారణ కోసం వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్

Karimnagar: కరోనా వైరస్ నివారణ కోసం వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్
x
Highlights

డోర్ టూ డోర్ సర్వేలో నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. నేడు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా వైద్య అధికారులతో మాట్లాడుతూ... నగరంలో కర్ఫ్యూ ప్రభావిత ప్రాంతాల్లో, డోర్ టూ డోర్ సర్వేను పకడ్భంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

డోర్ టూ డోర్ సర్వేలో నిర్లక్ష్యం చేయరాదని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. నేడు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా వైద్య అధికారులతో మాట్లాడుతూ... నగరంలో కర్ఫ్యూ ప్రభావిత ప్రాంతాల్లో, డోర్ టూ డోర్ సర్వేను పకడ్భంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.బుధవారం రోజున ఐ.ఎం.ఏ వారి సహకారంతో వైద్యులు, సూపర్ వైజర్లు, ఏ.ఎన్.ఎం.లతో కూడిన 30 వైద్య బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు.

అనుమానితులు ఎవరైనా ఉంటే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తామని ఆయన తెలిపారు. డబ్ల్యుహెచ్వో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం కరీంనగర్ అర్బన్ లో, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫీవర్ సర్వే కొనసాగించవడుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, వలస వచ్చిన ప్రజలు ఉన్నచోట, గ్రామాలలో విధిగా ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు సాధ్యమైనంతవరకు గుమిగూడవద్దని, సామాజిక దూరాన్ని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, కరోనాను కట్టడి చేయడంలో ప్రజలందరూ సహకరించాలని అన్నారు.

ఈ సర్వేలో ఒక్క ఇల్లు కూడా వదలకుండా ప్రతి ఇంటిని సందర్శించి, ఆయా కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరి వివరాల సేకరణతో పాటు ఎవరైనా జలుబు, జ్వరం, దగ్గుతూ ఉన్నారా అనే వివరాలు అడిగి తెలుసుకుని, రికార్డులలో నమోదు చేయాలని ఆయన డాక్టర్లకు సూచించారు. ఈ ఇంటింటి సమయంలో ప్రజలు ప్రతి ఒక్కరు స్వచ్చంధంగా ముందుకు వచ్చి సర్వే బృందాలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories